Andhra IPS Officers: ఏపీలో సీనియర్ ఐపీఎస్‌లుగా ఉన్న పీఎస్ఆర్ సీతారామాంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణా టాటాల సస్పెన్షన్  మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురూ ప్రభుత్వం మారినప్పటి నుంచి విదుల్లో లేరు. మొదట ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. తర్వాత సస్పెన్షన్ వేటు వేశారు.          

సినీ నటి జెత్వానీపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని అభియోగాలు          

వీటిపై వేటు వేయడానికి ప్రధాన కారణం ముంబై నటి కాదంబరి జెత్వా నీ కేసు. వైసీపీ హయాంలో ముంబయి నటి కాదంబరీ జత్వానీని తప్పుడు కేసులో అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారని ముగ్గురు ఐపీఎస్ అధికారులపై అభియోగాలున్నాయి.   తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని.. వైసీపీ నేత విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నిలపై చర్యలు తీసుకోవాలని కాదంబరి జెత్వనీ గతంలో పోలీసులుక  ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏకంగా ఐపీఎస్ అధికారులపైనే తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంతో అప్పటి  డీజీపీ ద్వారకా తిరుమలరావు దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.          

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిర్యాదు చేసిన జెత్వానీ కుటుంబం                   

 ఆయన ఆదేశాలతో విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు.. ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కాదంబరీ జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసు ను దర్యాప్తు చేశారు.  దీనిపై నివేదికను డీజీపీకి సమర్పించారు. ఈ క్రమంలో ముగ్గురు ఐపీఎస్‌లపైనా తాజాగా వేటు పడింది. ఈ వ్యవహారానికి సంబంధించి  ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను  చాలా కాలం క్రితమే సస్పెండ్ చేశారు. ముంబై నటి కాదంబరి జెత్వానీ.. తన స్థలాన్ని అక్రమంగా అమ్మేసేందుకు ప్రయత్నించి ఐదు లక్షలు తీసుకుందని వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేయడానికి ముందే పోలీసులు ఆమెను అరెస్టు చేయడానికి ముంబై టిక్కెట్లు బుక్ చేసుకున్నారు                 

ముగ్గురు ఐపీఎస్‌లకు మరింత గడ్డు కాలం 

ఆమె కుటుంబాన్ని తీసుకు వచ్చి చిత్ర హింసలు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి సినీ నటుల్ని అరెస్టు చేస్తే మీడియా ముందు ప్రవేశ పెట్టేవాళ్లు .కానీ అసలు ఈ వ్యవహారం ప్రభుత్వం మారే వరకూ ఎవరికీ తెలియదు. ప్రభుత్వం మారిన తరవాత మీడియాలో వచ్చిన తర్వాతనే కాదంబరి జెత్వానీ బయటకు వచ్చి కేసులు పెట్టారు. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆయన బెయిల్ తెచ్చుకున్నారు.  పోలీసు అధికారులకు ముందస్తు బెయిల్ లభించింది. చాలా కాలం అరెస్టు చేయకపోవడం.. పీఎస్ఆర్ ఆంజనేయులు ఎలాంటి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయకపోయినా ఆయనను  అరెస్టు చేయకపోవడంతో మిగిలిన వారికి బెయిల్ లభించింది.