Punganoor Tension:    చిత్తూరు జిల్లా పుంగనూరులో  తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రాజెక్టుల పర్యటన కోసం పుంగనూరు వస్తున్న చంద్రబాబును అడ్డుకునేందుకు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు పలు చోట్ల దాడులకు దిగారు. మొదట అంగళ్లు గ్రామం వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చినవారిపై దాడులకు పాల్పడ్డారు. ఆ తర్వాత చంద్రబాబు కాన్వాయ్.. పుంగనూరు వైపు వస్తున్న సమయంలో మరోసారి దాడులకు దిగారు. చంద్రబాబుపై రాళ్ల వర్షం కురిపించారు. ఎన్‌ఎస్‌జీ కమెండోలు.. రాళ్లదాడి నుంచి రక్షణగా నిలబడ్డారు. 


చంద్రబాబు  పర్యటనను అడ్డుకుంటామని పెద్ద ఎత్తున వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రకటనలు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు కాన్వాయ్ పై దాడి చేయడమే కాదు.. రాళ్ల దాడి చేశారు. ఈ సమయంలో పోలీసులు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలను అదుపు చేసే ప్రయత్నం చేయకుండా టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడంతో ఇదే అదనుగా వారంతా విరుచుకుపడినట్లుగా  తెలుస్తోంది.   వాహనలకు  వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. ఈ దృశ్యాలన్నీ భీతావహంగా ఉన్నాయి. 


చంద్రబాబు అంగళ్లు గ్రామానికి రాక ముందు కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  పుంగనూరులో రెండు నీటి ప్రాజక్టులపై కోర్టు స్టే తెచ్చి నిలిపివేశారని.. అభివృద్ధి చేస్తే ఏమాత్రం సహించలేక ఇలాంటి పనులు చేశారని అందుకే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ కార్యకర్తలు ప్రకటించారు.  చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్లపై పెద్ద ఎత్తున గుమికూడారారు.  పుంగనూరులో ప్రాజెక్టులు నిలిచిపోవడామికి కారణమైన చంద్రబాబును ఎట్టి పరిస్థితులలో ఇక్కడ అడుగుపెట్టినివ్వమని హెచ్చరించారు.  పెద్దిరెడ్డి అరాచకాలకు, అవినీతి ప్రతీక ఆ ప్రాజెక్టులు అందుకే అడ్డుకుని రైతులకు న్యాయం చేశామని.. రైతులకు పరిహారం ఇవ్వకుండా.. పెద్దిరెడ్డి దోచుకున్నారని మండిపడుతున్నారు. 
 


ప్రతిపక్ష నాయకుడి పర్యటనను అడ్డుకుంటామని వైసీపీనేతలు రోడ్డుపైకి పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నరాని.. టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నాయకుల  దౌర్జన్యంకు భయపడే పరిస్థితి లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. బంబులతోనే పోరాడిన వ్యక్తి నేను.. రాళ్ళు వేస్తే భయపడతానా..అని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే తన ముందుకు రావాలని సవాల్ చేశారు. తాను  కూడా  నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టా.. చిత్తూరు జిల్లాలోనే రాజకీయం చేశానన్నారు.  జగన్ లాంటి రాజకీయాలు నేను ఎప్పుడూ చూడలేదని  విమర్శించారు.  చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత... వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఒక్క సారిగా విరుచుకుపడ్డారు. దీంతో పరిస్థితి మరింత తవ్రంగా మారింది. 


చంద్రబాబు పర్యటన విషయంలో, భద్రత విషయంలో పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది.  జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేతకు ఇవ్వాల్సినంత ప్రోటోకాల్ ఇవ్వడంలేదని దాడులు చేయడానికి వచ్చే  వారిని ఉద్దేశపూర్వకంగా కాన్వాయ్ దగ్గరకు వెళ్లేందుకు సహకరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు చూట్టూ ఎన్ఎస్‌జీ కమెండోలు..  రక్షణగా ఉన్నా.. రాళ్లు వచ్చి పడటం భద్రతా వైఫల్యానికి పరాకాష్టగా నిలిచిందని చెబుతున్నారు.