AP Crime Year Ender 2022 :   నేరాలు జరిగిన తరువాత అందులో నిందితులకు శిక్ష పడే అవకాశాలు చాలా తక్కువ.అయితే ఇక పై ఇలాంటి పరిస్దితులు ఉండవని అంటున్నా ఎపీ డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి.. ఈ ఏడాది కన్విక్షన్ శాతం 66.2 గా ఉందని, వచ్చే ఎడాది ఇది మరింత పెంచటమే నూతన సంవత్సరం టార్గెట్ అని వెల్లడించారు. ఈ ఏడాది పెండింగ్ కేసుల సంఖ్య తగ్గిందని, లోక్ అదాలత్ లో కూడా 57 వేల కేసులను పరిష్కరించినట్లు ఏపీ డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది శిక్షలు పడే శాతం పెంచేందుకు పాలసీ పరంగా మార్పులు కూడా చేపట్టామని ఆయన వెల్లడించారు. మహిళల అత్యాచారాల, హత్య కేసులో 44 మందికి శిక్ష పడిందని ఆయన ప్రకటించారు.88.5 శాతం కేసుల్లో చార్జీషీట్ల వేశామని, తెలిపారు. 2021 కంటే 2022లో 60 వేల కేసులు తక్కువ నమోదు అయ్యాయిన్నారు. ఏపీలో క్రైం రేటు తగ్గిందని, 169 పీడీ యాక్టు కేసులు కూడా నమోదు చేశామని చెప్పారు. 2021లో 284753 కేసులు నమోదు అవగా 2022లో 231359 కేసులు నమోదు అయ్యాయి. మహిళా పోలీసుల వల్ల గ్రామాల్లో క్రైం చేసే వారి వివరాలు ముందే తెలుసుకోగలుగుతున్నామన్నారు.. హత్యలు 945 నుంచి 857కి తగ్గాయని వివరించారు.


రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రత్యేక చర్యలు 


రోడ్డు ప్రమాదాలు జరగటానికి కారణాలు అన్వేషించామని డీజీపీ చెప్పారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే స్పాట్స్ ను గుర్తించి అక్కడ చర్యలు చేపట్టామని చెప్పారు. టూ వీలర్ వల్ల జరిగే ప్రమాదాల శాతం  గుర్తించి వాటికి సంబంధించిన చర్యలు చేపట్టామని, 50 నుంచి 60 శాతం ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించినట్లు చెప్పారు.వాహనాల వేగం తగ్గించటానికి, అంతర్గత రోడ్లు ప్రధాన రోడ్లకు కలిసే చోట బారికేడ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంతో పోల్చితే, రోడ్డు ప్రమాదాల సంఖ్య 19200 నుంచి 18739 తగ్గాయని, ప్రమాదాల వల్ల గత ఏడాది 7430 మంది చనిపోతే 2022లో  మాత్రం 6800 మాత్రమే ఉన్నాయన్నారు.  ఏడాది రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది హెల్మెట్లు లేక తలకు గాయమై ప్రాణాలు వదిలారని వివరించారు.టూ వీలర్ నడిపే వారు హెల్మెట్లు ధరించాలని కోరారు.


ఎస్సీ,ఎస్టీ ల పై దాడులు తగ్గాయి...!


ఎస్సీ, ఎస్టీల మీద జరిగే క్రైం కూడా ఈ ఏడాది తగ్గింనట్లు డీజీపీ వెల్లడించారు.  4 చోట్ల రీజనల్ సైబర్ సెంటర్స్ పెట్టి ట్రైనింగ్ ఇస్తామని వివరించారు.దిశ యాప్ ను 85 లక్షల మంది మహిళలు ఉపయోగించడం జరిగింది  అన్నారు. రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే క్రైమ్స్, రోడ్డు ప్రమాదాలు, సైబర్ కేసులు, మహిళల పై అత్యాచారాలు అన్ని తగ్గాయిని తెలిపారు. వీటి పై ఫోకస్ పెట్టి నేరాలు తగ్గడానికి పోలీసు శాఖ మరింత కృషి చేస్తామన్నారు. ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు. వారిని  రక్షించడానికే పోలీసు శాఖ ఉందని ఎటువంటి కష్టం వచ్చిన పోలీసులను సంప్రదించాలని సూచించారు.దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 1500 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని వివరించారు. 


పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు కొంత మేర అమలు


వీక్లీ ఆఫ్ లు పోలీసులకు కొంత మేరకు మాత్రమే ఇస్తున్న విషయం వాస్తవమేనని అన్నారు.నెలకు  నెలకు 4 వీక్ ఆఫ్స్ ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నామని,కొత్తగా పోలీస్ రిక్రూట్మెంటుకి ప్రభుత్వం అనుమతివ్వడంతో ఇది సాధ్యమే అవకాశం ఉందని తెలిపారు. ఎపీలో నాటు సారా కట్టడికి కఠిన చర్యలు చేపట్టామని,100 గ్రామాల్లో నాటు సారా తయారీ అడ్డుకున్నట్లు వెల్లడించారు.600 ఎకరాల్లో గంజాయి సాగుని దహనం చేసినట్లు వెల్లడించారు.వేరే రాష్ట్రాల్లో కూడా గంజాయి సాగు అడ్డుకోవాల్సి ఉందని,నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా గంజాయి సాగును దహనం చేసినట్లు వెల్లడించారు.గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సబ్సిడీ పై అందించిట్లు చెప్పారు.శాటిలైట్ ఫొటోస్ ద్వారా మరెక్కడయినా   గంజాయి సాగు జరుగుతుందా అనే విషయాన్ని సర్చ్ చేసి మరి చర్యలు తీసుకుంటామని డీజీపీ వివరించారు.