Dasapalla Lands Issue :  విశాఖలో దసపల్లా భూములు కబ్జాకు గురయ్యాయని వస్తున్న ఆరోపణలపై ఆ భూమి యజమానులు, వారితో ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్లు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. దసపల్లా భూముల్లో అరవై ఐదు మందికి యజమానులుగా ఉన్నామని.. అందరం కలిసే డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలని నిర్ణయించామని బాలాజీ అనే బిల్డర్ తెలిపారు. ఆయన భూ యజమానుల్లో ఒకరు.  సుప్రీం కోర్టు టైటిల్ నిర్ధారించాక భూముల 22 ఏ జాబితాలో  ఉన్నా ఇబ్బంది ఎదురవుతుందని అనుకోలేదన్నారు. పూర్తిగా ఇష్టప్రకారమే డెవలప్మెంట్ కి ఇచ్చామని చెప్పారు.  2014 లో టైటిల్ కి సంబంధించి కమలా దేవి కి దఖలు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని కమలాదేవి తరపు లాయర్ సుబ్బరాజు తెలిపారు.  


అమలు చేయకపోవడం తో గత కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు నెల రోజులు జైలు శిక్ష కూడా విధించిందని లాయర్ గుర్తు చేశారు. ఆయన అప్పీల్ కి వెళ్లి ఆపుకున్నారనని తెలిపారు. కోర్టు నిర్ణయాన్ని అమలు చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నామని దసపల్లా యజమానులు అసోసియేషన్ ప్రెసిడెంట్ కంకటాల మల్లిక్ తెలిపారు. ఎవరూ తమను బలవంతం చేయలేదని తామే స్వచ్చందంగా ఒప్పందం చేసుకున్నామని యజమానులు తెలిపారు. డెవలప్‌మెంట్ కాంట్రాక్ట్ విషయంలోనూ అక్రమాలు జరిగాయని..  అతి తక్కువ భూ యజమానులకు ఇస్తున్నారన్న ఆరోపణలపై బిల్డర్లు స్పందించారు.  30:70 నిష్పత్తిలో యాజమాన్యం,  డెవలపర్లు కు ఒప్పందం కుదిరిందvf..  విశాఖ లో ఈ నిష్పత్తులు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉన్నాయని అష్యూర్ డెవలపర్స్ డైరక్టర్ ఉమేష్ వివరమ ఇచ్చారు.  


అనేక మన్నాకారకాలను దృష్టిలో ఉంచుకుని ఒక చదరపు గజానికి 12 చదరపు అడుగుల ను డెవలపర్ కు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.   ఆవ్యాన్ రియల్టర్స్  నుంచి  దసపల్లా భూములకోసం అష్యూర్ డెవలపర్స్ కి నిధులు రావడం అవాస్తవమని స్పష్టం చేశారు. అయితే నిధులు వచ్చాయని..  గోపీనాథ్ రెడ్డి కి వేరే అవసరాల కోసం వచ్చిన అమౌంట్స్ ను దసపల్లా భూముల కోసం వచ్చినట్లుగా ప్రచారం  చేస్తున్నారని ఆరోపించారు.  అవ్యాన్ రియల్టర్లు నుంచి అష్యూర్ డెవలపర్స్ కి ఒక్క రూపాయి కూడా రాలేదని మరో బిల్డర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు.  30 : 70 ఒప్పందానికే అభ్యంతరం ఉంటే విశాఖ లో 1:99 కూడా జరిగిన వాటిపైనా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.  


దసపల్లా భూములు ప్రభుత్వానివని.. వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని సరైన అప్పీల్‌కు వెళ్లలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దసపల్లా భూముల విషయంలో ఆరోపణలు చేసిన వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇప్పుడు దగ్గరుండి మరీ వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి.. ఆ స్థలాలను డెవలప్‌మెంట్ కింద తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. దీనిపై విమర్శలు పెరిగిపోతూండటంతో  బిల్డర్లు, యజమానులు ఇలా మీడియా ముందుకు వచ్చారు. అయితే వారు చెప్పిన విషయాల్లోనూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది మీడియాపై ఎదురుదాడికి దిగడంతో గూడుపుఠాణి ఉందన్న అభిప్రాయం మరింత బలపడుతోంది.