AP BJP Vs Janasena :  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ బీజేపీకి జనసేన మద్దతు ఇవ్వకపోవడంపై ఆ పార్టీ ఆగ్రహంది. తాము అడిగినా పవన్ కల్యాణ్ స్పందించలేదని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి  పాలైన  మాధవ్ అసంతప్తి వ్యక్తం చేశారు. బీజేపీ పదాధికారుల సమావేశం  తర్వాత మాధవ్ మీడి్యాతో మాట్లాడారు.  గతంలో కూడా తమ పార్టీ ఓటమి చెందినా.. ఆ తర్వాత పుంజుకున్న సంఘటనలు ఉన్నాయని..  ఎమ్మెల్సీ ఎన్నికలలో గతంలో కంటే బీజేపీకి మెరుగైన ఓట్లు వచ్చాయని మాధవ్ చెప్పుకొచ్చారు.  ఉత్తరాంధ్ర లో మాత్రమే బీజేపీ వైఫల్యం చెందిందన్నారు.  భవిష్యత్ లో ఎటువంటి అంశాలపై దృష్టి పెట్టాలనేది మా పెద్దలు సూచనలు చేశారని..  ఏప్రిల్ 14 వరకు వివిధ రూపాలలో కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రకటించారు.  


బీజేపీ పొత్తులకు సంబంధించి కూడా అనేక అంశాలు ప్రచారం జరుగుతున్నాయని..  ఎ  బీజేపీ బలోపేతం కోసం తాము కృషి చేస్తామని మాధవ్ చెప్పారు.  పొత్తులపై మాత్రం మా జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు.  పవన్ కళ్యాణ్  చెప్పినట్లు ఇరు పార్టీల కార్యకర్తలు పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.  ఈ దిశగా ఆలోచన చేయాలని పవన్ కళ్యాణ్, మనోహర్ గారిని కోరుతున్నామని మాధవ్ తెలిపారు. ఏపీలో  పవన్ కళ్యాణ్ కు మంచి అవకాశం ఉంది.. మొన్న సభకు వచ్చిన జనాన్ని అందరూ చూశారు.. ఇరు పార్టీలు కలిసి పోరాటాలు చేస్తే.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.  బీజేపీతో కలిసి  ముందుకు వెళితే.. రాష్ట్రంలో ఒక ప్రభంజనం సృష్టించవచ్చన్నారు.  ప్రస్తుతానికి బీజేపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళుతున్నాయన్నారు. 
 
అమరావతి రాజధానిగా ఉంటుందని ఇప్పటికే చెప్పాం.. బీజేపీ దానికే కట్టుబడి ఉందని మాధవ్ చెప్పారు.  ఏ పార్టీ తీర్మానం చేయకపోయినా.. బీజేపీ మాత్రమే ఎపీ రాజధాని అమరావతి అని తీర్మానం చేసిందన్నారు.  బీజేపీ చేపట్టిన అనేక కార్యక్రమాలకు జననేనను ఆహ్వానించామని వారు రాలేదన్నారు.  ఎవరిలోనైనా అసంతృప్తి ఉంటే... అంతర్గతంగా వాటిని మేము పరిష్కరించుకుంటామన్నారు.  బీజేపీ ఎఫ్పడూ వైసీపీ ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తూనే ఉందని మాధవ్ చెప్పారు.  ఇసుక, మైనింగ్, మద్యం వంటి అంశాలలో పోరాటాలు కూడా చేశాం గతంలో ప్రజా పోరు పేరుతో వీధి సభలు పెట్టాం ...  రెండో విడత కూడా వీధి సమావేశాలు పెట్టి.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. 


యువతను, ఉద్యోగులను, మహిళలను జగన్ మోసం చేశారని.. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉండి.. జీతాలు కూడా సకాలంలో వేయని పరిస్థితికి తెచ్చారని ఆరోపించారు.  మే 1వ తేదీ తర్వాత ఛార్జిషీటు కార్యక్రమం చేపడతామని.. ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తామన్నారు.  వాటిని అమలు చేయకుండా ఏ విధంగా మోసం చేసిందీ వివరిస్తామని ప్రకటించారు.  ఈ ఛార్జిషీటు మొత్తం రెడీ అయ్యాక బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు.  విశాఖలో జరిగిన సమ్మిట్ లో కేంద్ర మంత్రులు వచ్చి..  హామీలు ఇచ్చారు .. అది రాజకీయ సభ కాదు కాబట్టే... రాష్ట్ర అభివృద్దిలో భాగస్వామ్యం అయ్యామన్నారు.  ఎవరు పెట్టుబడి పెట్టినా... అది ఎపీకి వస్తుంది కాబట్టి.. మేము స్వాగతిస్తున్నామన్నారు.