Chanderababu :  ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారు.  ఈ కేసులో ఇవాళ్టి వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా విచారణను నవంబర్‌ 7కు హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు తెలిపింది. ముందస్తు  బెయిల్ పొడిగించినట్లయింది. విచారణ సమయంలో.. సుప్రీంకోర్టులో 17ఏ సెక్షన్ వర్తింపుపై తీర్పు రానుందని.. అందులో తమకు అనుకూలంగా తీర్పు వస్తే..ఈ కేసుకు కూడా వర్తిస్తుందని చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ విచారణపై గతంలో హైకోర్టు స్టే విధించింది. ఏసీబీ కోర్టులో విచారణపై స్టేను నవంబర్‌ 7 వరకు హైకోర్టు పొడిగించింది.


ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పై విచారణ వాయిదా          


ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పీటీ వారెంట్‌పై నేడు చంద్రబాబును ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉంది. అయితే.. మంగళవారం నాడు ఈ కేసులో దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది. అంతేకాదు.. విచారణ జరిగేదాకా బాబును అరెస్ట్ అరెస్ట్‌ చేయొద్దని సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీకి కోర్డు సూచించింది. ఇప్పుడు అదే అంశాన్ని మెమో ద్వారా ఏసీబీ కోర్టుకు సీఐడీ తెలిపింది.  


చంద్రబాబు హెల్త్ బులెటిన్ పై విచారణ జరపనున్న ఏసీబీ కోర్టు            


చంద్రబాబు హెల్త్‌ బులిటెన్‌ పిటిషన్‌పై కూడా నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనున్నది. బాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు హెల్త్ బులెటెన్ విషయంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ వేయాలని సీఐడీని ఇప్పటికే కోర్టు ఆదేశించింది. నిన్న సాయంత్రం సీఐడీ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది.  


గవర్నర్ ను కలవనున్న టీడీపీ నేతలు                                        


మరో వైపు   రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను  టీడీపీ నేతల బృందం  బుధవారం  సాయంత్రం కలువనుంది. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అక్రమ అరెస్ట్‌  , నాయకుల గృహనిర్బంధం అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకురానున్నారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా గవర్నర్‌కు టీడీపీ నేతలు వివరించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో తొలిసారిగా గవర్నర్‌ను టీడీపీ నేతలు కలుస్తున్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో యనమల రామకృష్ణుడు  , వర్లరామయ్య  , గద్దె రామ్మోహన్ , బోండా ఉమా  .. గవర్నర్‌ను కలువనున్నారు