Steel Plant News : కేసీఆర్ దెబ్బకు కేంద్రం స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేసిందని బీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేసి గంటలు గడవక ముందే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా షాక్ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ అమ్మకం విషయంలో వెనక్కి తగ్గలేదని స్పష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటకరణను తాత్కలికంగా పక్కన పెట్టామంటూ కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ చేసిన ప్రకటనకు మీడియాలో విస్తృత ప్రచారం లభించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గినట్లేనని అందరూ అనుకున్నారు. తమ ఘనత అంటే్ తమ ఘతన అని ప్రకటించుకున్నారు. కానీ..అదంతా అవాస్తవం అని.. తేలిపోయింది. విస్తృతంగా జరుగుతున్న ప్రచారంపై కేంద్రం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందన్న కేంద్రం
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మొత్తంగా కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ లో వాటాల ఉపసంహరణ ప్రకియపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని.. ఆపడానికి కూడా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని.. స్పష్టం చేసింది. డిజిన్విస్టె మెంట్ ప్రక్రియ కొనసాగుతుదని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశారని వివిద పత్రికల్లో.. మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగానే ఈ వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని కేంద్రం తెలిపింది.
విశాఖలోనే మాట మార్చిన కేంద్రమంత్రి ఫగన్ సింగ్
గురువారం ఉదయం ప్రైవేటీకరణ లేదని చెప్పిన కేంద్ర మంత్రి సాయంత్రానికి మాట మార్చారు. తాను స్టీల్ ప్లాంట్ ( RINL ) ను లాభాల బాట పట్టించే మార్గాలపై దృష్టి పెట్టామని మాత్రమే చెప్పానని ప్రవేటీకరణ రద్దు అంశం తన పరిధి లోనిది కాదని స్పష్టం చేసారు . పైగా కేంద్ర సహాయ మంత్రినైన తాను కేబినెట్ తీసుకున్న నిర్ణయం పై ఎలా మాట్లాడుతానని ప్రత్యేకంగా కార్మిక నేతలను పిలిపించుకుని మరీ చెప్పారు. కేవలం ఉద్యోగ ,కార్మిక సంఘాల అభిప్రాయాలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకు వెళతానని వారికి చెప్పారు . దానికి కొనసాగింపుగాకేంద్రం.. పెట్టుబడుల ఉపసంహరణపై వెనక్కి తగ్గేది లేదని ప్రకటించింది.
క్రిడెట్ తీసుకున్న రాజకీయ పార్టీలు ఇప్పుడేం చేస్తాయి ?
కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గడానికి కారణం తామంటే తాము అని పోటీ పడి ప్రకటించుకున్న పార్టీలకు ఇప్పుడు షాక్ తగిలినట్లయింది. ఇప్పుడు ఆ పార్టీలు ఎలాంటి స్పందన చేస్తాయోననే ఆసక్తి వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు ఏదైనా అనుకూలంగా జరిగితే.. మొత్తం క్రెడిట్ తమకేనని మీద వేసుకుంటాయి. నెగెటివ్ గా ఏదైనా జరిగితే మాత్రం.. పక్క పార్టీల మీద వేస్తూ ఉంటాయి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలోనూ అలాంటి రాజకీయ ప్రకటనలే వచ్చే అవకాశం ఉంది.