అనంతపురం జిల్లాలో పోలీసుల వ్యనహారశైలి ప్రజలను ఆశ్చర్య పరుస్తోంది., కొంత మంది ఆఫీసర్లు ప్రజలతో మన్ననలు పొందుతుంటే మరికొంత మంది దారుణమైన విమర్శలను ఎదుర్కొంటున్నారు. దొంగలను పట్టుకుని పూర్తి స్థాయి సొమ్ము రికవరీ చేశారని ఓ అధికారిని ప్రజలు సన్మానించారు. అదే సమయంలో మరో అధికారి రాజకీయ నేతను అడ్డగోలుగా పొగిడి హవ్వ అనిపించారు. మరో అధికారి..  ఉన్నతాధికారికి లేఖ రాసి మీడియాలోనూ లీక్  చేశారు. ఈ  పరిమామాలతో అనంతపురం జిల్లాలో పోలీసు శాఖ కట్టు తప్పిందన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. 


Also Read : Madhapur Accident: మద్యం వల్లే మాదాపూర్ యాక్సిడెంట్‌! ఆ కారుపై భారీ చలాన్లు, అన్నీ అలాంటివే..


గుత్తి ఎస్ఐ సుదాకర్ యాదవ్ పేరిట ఇటీవల ఓ లేఖ హల్ చల్ చేసింది.  ఆ లేఖలో తన పై అధికారి అయిన సీఐ అవినీతి.. డీఎస్పీ కులపిచ్చిపై ఆయన ఆరోపణలు చేశారు.  అయితే ఆ లేఖలో సదరు ఎస్ఐ సంతకం లేకపోవడంతో పోలీసు ఉన్నతాదికారులు అంతర్గతంగా విచారణ చేపట్టారు. ఆ విచారణం ఏం తేలిందో కానీ  గుత్తి సిఐ,ఎస్ఐలను సెలవపై వెళ్లాలని మౌఖికంగానే ఆదేశించారు.  దీంతో ఇద్దరు అధికారులు సెలవు పెట్టి వెళ్లిపోయారు. జిల్లా ఎస్పీగా ఫక్కీరప్ప భాద్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో డిపార్టుమెంట్‌ను పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కింది స్థాయి అధికారులు నేతల చుట్టూ తిరిగి చేస్తున్న భజనలతో  పోలీసుశాఖ పరువు పోతుంది. అనేక చోట్ల పోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు వ్యక్తం అవుతూనే వున్నాయి. నల్లమాడలో స్టూడెంట్ కిడ్నాప్,హత్యతో అక్కడి పోలీసులపై స్వయంగా భాదితులే ఆరోపణలు చేశారు.  వాటిలో వాస్తవాలు ఉన్నాయని  తెలిసినప్పటికి వారిపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాదికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి.


Also Read : Chittor Rape: 80 ఏళ్ల బామ్మపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం.. అనంతరం బాలికపై మరో రేప్‌నకు యత్నం


విద్యార్థి కిడ్నాప్ అయ్యాడని సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసులు స్పందించలేదు. ఈ కారణంగా విద్యార్థి హత్యకు గురయ్యాడు. తీరిగ్గా ప్రాణం పోయిన తర్వాత నిందితుల్ని అరెస్ట్ చేశామని చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.  తల్లిదండ్రులు పిర్యాదు ఇచ్చిన వెంటనే పోలీసులు స్పందించి వుంటే హత్యకు గురయ్యేవాడు కాదన్నది తల్లిడంద్రులు,గ్రామస్థులు మాట.  ఇక రాయదుర్గంలో కూడా పోలీసు అదికారులపై అనేక విమర్శలు వ్యక్తం అవతూనే వున్నాయి.ఉరవకొండలో హిజ్రా ఇంట్లో చోరీ చేస్తే వాటిని రికవరీ చేయడంలో కీలకపాత్ర పోషించిన సిఐ శేఖర్‌ను సన్మానాలతో ముంచెత్తారు..


Also Read : Hyderabad Accident: నిశ్చితార్థం జరిగింది..త్వరలోనే ఓ ఇంటివారుకానున్నారు...కానీ ఇంతలోనే....


అలాగే మడకశిర పరిధిలో సెంటు ప్యాక్టరీలో అక్రమంగా   ఎర్రచందనం దుంగలు పెద్ద ఎత్తున వున్నాయన్న పక్కా సమాచారంతో రైడ్ చేసి పట్టుకుని మంచి పేరు తెచ్చుకున్నారు.  అయితే ఇటీవలి కాలంలో కొందరు అదికారుల తీరుపై బహిరంగంగానే విమర్శలు వ్యక్తం అవుతున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్న తీరుపైనే జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కొంత మంది అధికారుల తీరు వల్ల మొత్తం జిల్లా పోలీసుల పనితీరుపై మరకలు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.


Also Read : Pocso Case: కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపై అఘాయిత్యం...



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి