ఆంధ్రప్రదేశ్ మందు బాబులకు ఈ సారి అనూహ్యమైన గిఫ్ట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. పాపులర్ బ్రాండ్లు దొరక్క మేడిన్ ఆంధ్రా మద్యం బ్రాండ్లతో గొంతు తడుపుకుంటున్నవారికి కొత్త ఏడాదిలో కాస్త ఊరట లభించే నిర్ణయం తీసుకుంది. పాపులర్ బ్రాండ్లను మళ్లీ మద్యం దుకాణాల్లోకి అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఆయా మద్యంకంపెనీలకు ఇండెంట్ పెట్టింది. ఆ సరుకు రావడం కూడా ప్రారంభమైంది. ప్రస్తుతానికి కొన్ని పాపులర్ బ్రాండ్ల మద్యం బెవరేజెస్ కార్పొరేషన్ డిపోలకు చేరింది. వాటిని జనవరి ఒకటో తేదీ నుంచి మందు బాబులకు అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.


Also Read: ఆర్ఆర్ఆర్‌కూ ఏపీలో అవే టిక్కెట్ ధరలు.. ఏమీ తేల్చకుండానే కమిటీ తొలి భేటీ వాయిదా !


ఏపీలో వైఎస్ఆర్‌సీపీ సర్కార్ వచ్చిన తర్వాత మద్యం విధానం సమూలంగా మారిపోయింది. ప్రభుత్వం అధీనంలోకి  అమ్మకాలు వచ్చాయి. దుకాణాలన్నీ ప్రభుత్వమే నిర్వహిస్తోంది.   అంతే కాదు ఓన్లీ ఫర్ ఆంధ్రా బ్రాండ్స్ మాత్రమే అమ్మడం ప్రారంభించారు.  ఆ మద్యం ఇతర రాష్ట్రాల్లో అమ్మడానికి పర్మిషన్ ఉండదు. ఏపీలో మాత్రమే అమ్ముతారు. పాపులర్ బ్రాండ్లను ఎందుకు అమ్మరని విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే హఠాత్తుగా పాపులర్ బ్రాండ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకుంది. 


Also Read: తంబళ్లపల్లె వైఎస్ఆర్‌సీపీలో ముసలం.. పెద్దిరెడ్డి సోదరుడిపై జడ్పీటీసీ భర్త తీవ్ర ఆరోపణలు !


ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు చాలా ఎక్కువ. పొరుగున ఉన్న తెలంగాణతో పోలిస్తే మూడింతలు ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో కావాల్సిన బ్రాండ్లు దొరకవు.  వారు అమ్మేదే కొనుక్కోవాలి., ఈ కారణంగా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మద్యం స్మగ్లింగ్ జరుగుతోంది. ఏపీలోకి వస్తోంది.  పలువురు స్మగ్లర్లు దీన్నే ప్రధాన ఆదాయవనరుగా మార్చుకున్నారు. ప్రభుత్వం వాటిని కంట్రోల్ చేయడానికి ఎస్‌ఈబీని ఏర్పాటు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వెల్లువలామద్యం  స్మగ్లింగ్ జరుగుతూండటంతో... చివరికి ఏపీలోనే పాపులర్ బ్రాండ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నారు. 


Also Read: టీటీడీ ఐటీ అడ్వైజర్‌గా మింత్రా మాజీ సీఈవో అమర్ నగారం ! భక్తులకు మరిన్ని ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయా ?


నిజానికి ఏపీ మద్యం ధరలు, బ్రాండ్ల కారణంగా తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లోని జిల్లాల్లో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఈ కారణంగా ఏపీ బోర్డర్ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు కూడా డిమాండ్ తగ్గిపోయింది. ఈ పరిస్థితులన్నింటినీ అధ్యయనం  చేసిన ప్రభుత్వం.. ఇటీవల ధరలు తగ్గించింది. ఇప్పుడు బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది.


Also Read: మందుబాబులకు న్యూ ఇయర్ గిఫ్ట్... అర్ధరాత్రి వరకూ షాపులు ఓపెన్... ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి