Anantapur TDP : ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులపై వారం రోజుల్లో పోలీసులు ఆరు కేసులు పెట్టారు. అన్నింటిలోనూ ఏ -1 గా కాల్వ శ్రీనివాసులు పెట్టారు. తనపై అన్నీ అక్రమ కేసులు పెట్టారని.. వీటిపై ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు కాల్వ శ్రీనివాసులు సిద్ధమయ్యారు. అయితే ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. రాయదుర్గం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు టిడిపి కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. కాల్వ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీస్ జూలమ్ నశించాలి - అక్రమ అరెస్టులను ఖండించాలి అంటూ టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. కాలువ శ్రీనివాసులు ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.
పోలీసుల తీరుపై కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. కాపు రామచంద్రారెడ్డి అనుచరులు కుప్పిగంతులు వేస్తుంటే పోలీసులు కాపల కాస్తారని మండిపడ్డారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగేలా dj లు పెట్టి తాగి గంతులు వేస్తే పోలీసులు రక్షణ ఇస్తారరని.. టీడీపీ నేతలు బయటకు అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డంకులు, ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. స్వేచ్ఛగా నడవడానికి, మాట్లాడటానికి లేదు.. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కులు పోలీసులు కాలరాస్తున్నారని కాల్వ విమర్శించారు. రాయదుర్గం సీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నని .. డీఎస్పీకి చెబుదామంటే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదన్నారు.
వారం రోజుల్లో రాయదుర్గం లో ఆరు కేసులు నమోదు చేశారని.. అన్ని కేసుల్లో నాపై a1 గా పె్టారని.. అక్రమ కేసులపై అడగడానికి రాయదుర్గం వెళుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. నగరంలో మొత్తం సీఐ లు వందలమంది పోలీసులు తన ఇంటి వద్దే ఉన్నారన్నారు. టీడీపీ అధినాయకుడుని నెల రోజులుగా జైల్ లో బంధించారు. .. రాయదుర్గం లో టీడీపీ చేస్తూన్న నిరసన శిబిరాన్ని బలవంతగా ఖాళీ చేయించారన్నారు. రాయదుర్గం పోలీస్టేషన్ వద్దకు వెళ్లి నా పై పెట్టిన అక్రమ కేసులపై అడుగుతానంటే ఎందుకు భయపడుతున్నారని కాల్వ ప్రశ్నించారు. టీడీపీ పిలుపు ఇస్తున్న ఆందోళనలో స్వచ్చందంగా ప్రజలు పాల్గొంటున్నారని.. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కాపు రామచంద్ర రెడ్డి భయపడుతున్నాడన్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి టీడీపీ తరపున కాల్వ శ్రీనివాసులు, వైసీపీ తరపున కాపు రామచంద్రారెడ్డి పోటీ పడుతున్నారు. ఇటీవలి కాలంలో రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పలు రకాల నిరసనలు చేపడుతున్నారు. అయితే ఆ నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కాల్వపై వరుస కేసులు పెడుతున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. వైసీపీ నేతలు భారీ ప్రదర్శనలు నిర్వహించినా పట్టించుకోని వారు.. తమపై మాత్రం విరుచుకుపడుతున్నారని టీడీపీ నేతలంటున్నారు.