Vinayaka Chaviti 2022 Wishes: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించే ఈ విఘ్నేశ్వరుడి కృపకు అందరూ పాత్రులు కావాలని కోరుకున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. సకల శాస్త్రాలకు అధిపతిగా , బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యడుగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథుడిని ఆరాధిస్తారని సీఎం కేసీఆర్ (Telangana CM KCR) అన్నారు. వినాయక చవితి జ్ఞానం, లక్ష్య సాధన నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి మనకు నేర్పుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గణపయ్య ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంతో పాటు ప్రముఖ ఆలయాలను భక్తులు దర్శించుకుంటున్నారు. భిన్న ఆకారాలు, పద్ధతులలో ఉన్న గణపయ్య విగ్రహాలను ఉత్సాహంగా తీసుకెళ్లి చవితి వేడుకులు ప్రారంభించారు భక్తులు.






నవరాత్రి ఉత్సవాలతో శాంతి.. 
గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా, ఆనందంతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా, వినాయకుడి దీవెనలతో వాటన్నిటిని అధిగమిస్తూ.. సకల జన సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా.. సుఖ శాంతులతో జీవించేలా దేశ ప్రజలందరికీ.. ఆ ఏక దంతుని దీవెనలు అందాలని సీఎం కేసీఆర్ ప్రార్ఖించారు. 






వైఎస్ జగన్ శుభాకాంక్షలు.. 
ఏపీ ప్రజలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడని.. విఘ్నాలను తలగించి అభీష్టాలను నెరవేర్చే పూజ్యుడు విఘ్నేశ్వరుడని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన చల్లిని చూపు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి.. శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ప్రార్థించారు. అలాగే ప్రతీ ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపిన సీఎం జగన్.. వినాయక చవితి శభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 


Also Read: Kanipakam Temple: స్వయంభుగా వెలసిన కాణిపాకం వినాయకుడి చరిత్ర తెలుసా, గణపయ్య నిజంగానే పెరుగుతున్నాడా !