Chandrababu News :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన గురువారం ఏఐజీ ఆస్పత్రితో పాటు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలైన చంద్రబాబు.. రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లి వెళ్లారు. అయితే ప్రజలు ప్రతీ చోటా స్వాగతం చెప్పారు. రోడ్ల మీద గుమికూడారు. దీంతో  .. ఆయన తెల్లవారుజామున కానీ తాడేపల్లి చేరుకోలేకపోయారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం తర్వాత  హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మరో వైపు బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.                         
 
చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కండీషన్స్‌పై సీఐడీ ఏపీ హైకోర్టులో  దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.  మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు మీడియాతో మాట్లాడొద్దని, భారీ ర్యాలీలు చేపట్టకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టును సీఐడీ కోరింది రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారని కోర్టుకు సీఐడీ తరఫు న్యాయవాది తెలియజేశారు. ఈ మేరకు వీడియో క్లిప్పింగ్స్‌ను పెన్‌డ్రైవర్‌లో న్యాయస్థానానికి సీఐడీ తరఫు న్యాయవాది అందజేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ చంద్రబాబు మీడియాతో మాట్లాడారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ చర్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వాదించారు. అంతేకాదు 13 గంటల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ర్యాలీగా చంద్రబాబు తన నివాసానికి చేరుకున్నారని తెలిపారు. ర్యాలీ లు నిర్వహించ వద్దని కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పిన చేశారని కోర్టుకు సీఐడీ తెలిపింది. మధ్యంతర బెయిల్ వచ్చిన తొలిరోజే చంద్రబాబు నిబంధనలను ఉల్లంఘించారని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.                    


అయితే హైకోర్టు ఆదేశాలను ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు అతిక్రమించలేదని ఆయన తరఫు న్యాయవాదలు వాదించారు. చంద్రబాబు మాట్లాడటం అనేది ఆయన ప్రాథమిక హక్కులలో భాగమే తప్ప అతిక్రమించడం కాదని చెప్పుకొచ్చారు. జైలు శిక్ష పడిన వారికి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం గతంలో న్యాయస్థానాలు కల్పించాయి అని చెప్పుకొచ్చారు. కేసు గురించి చంద్రబాబు మీడియాతో మాట్లాడలేదన్నారు.  సీఐడీ విధించాని వాదిస్తున్న  షరతులు అన్నీ చంద్రబాుబ హక్కులు హరించే విధంగా ఉన్నాయన్నారు.  ఇవి కేసు దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో  సీఐడీ అధికారులు చెప్పలేకోతున్నారన్నారు.  ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. నవంబర్ 3న తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.          


 చంద్రబాబు ఎలాంటి పత్రికా సమావేశాలు, రాజకీయ ర్యాలీలు నిర్వహించకుండా అదనపు షరతులు విధించాలని సీఐడీ అధికారులు కోరుతున్నారు. ఇద్దరు డీఎస్సీ స్థాయి అధికారులు ఆయన రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించి కోర్టుకు నివేదికలు అందజేసేలా ఆదేశాలివ్వాలని కోరుతున్నారు.