RGV Yyuham Telangana High Court :  వివాదాస్పద  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కి్ంచిన వ్యూహం సినిమాపై విచారణ వాయిదా పడింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ టీడీపీ నేత నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శకుడు  వర్మ తెలుగుదేశం పార్టీని, తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యూహం సినిమా తీశారంటూ లోకేశ్‌  పిటిషన్‌లో పేర్కొన్నారు.  దీనిపై డిసెంబర్ 26న న్యాయస్థానం  విచారణ చేపట్టింది.  సినిమా విడుదలకు స్టే ఇవ్వాలని పిటిషనర్ లాయర్ కోరగా అందుకు కోర్టు నిరాకరించింది. 


హైకోర్టులో విచారణ ప్రారంభమైన తరువాత టీడీపీ తరపున మురళీధర్ రావ్ వాదనలు వినిపించారు. వ్యూహం చిత్రంలో రాజకీయాలకు సంబంధించిన పాత్రలను పెట్టారని, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని సోషల్ మీడియా ద్వారా తెలిసిందన్నారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులను డీఫేం చేసేలా సినిమా తీశారని, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అనుకూలంగా ఈ చిత్రాన్ని రూపొందించారని, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను రద్దు చెయ్యాలని హైకోర్టును కోరారు. 


స్కిల్ డెవలప్మెంట్ కేసు ప్రస్తుతం కోర్ట్ లో ఉంది.. కానీ, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కు పాల్పడి చంద్రబాబుకు కిక్ బ్యాక్స్ వచ్చాయని చూపించారు . సోనియా, మన్మోహన్, రోశయ్య పాత్రలను నెగిటివ్ గా చూపించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సెన్సార్ బోర్డుకుకూడా దీనిపై ఫిర్యాదు చేశామని తెలిపారు. వ్యూహం సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉన్నది రామదూత క్రియేషన్స్ అని.. ప్రొడ్యూసర్ అడ్రస్ కూడా వైసీపీ పార్టీకి చెందిన కార్యాలయంలోనే ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వ్యూహం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బహిరంగంగానే బాబు, పవన్ లు తనకు ఇష్టం లేదని ఆర్జీవీ చెప్పాడని, వ్యూహం సినిమా మొత్తం చంద్రబాబును కించపర్చేందుకే తీశారని, ఈ సినిమా ఫంక్షన్ లకు సైతం వైసీపీ మంత్రులు హాజరయ్యారని పేర్కొంటూ సినిమా ట్రైలర్, సాంగ్ ల పెన్ డ్రైవ్ లను టీడీపీ తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. 


ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికలపై ఈ సినిమా తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న హైకోర్టు విచారణను డిసెంబర్ 28కి వాయిదా వేసింది.   28న విచారణ చేపట్టాక స్టేపై నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. అంతకుముందే ఈ సినిమా విడుదలకు వారం రోజులు ఉందనగా రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాకిచ్చి్ంది. ఈ సినిమాను ఓటీటీతో పాటు ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  కి ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల  చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే విజయవాడలో  ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.