YS Viveka Case :  వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తన పని తాను చేసుకుపోవచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూన్ ఐదో తేదీకి ధర్మాసనం  వాయిద వేసింది.  మధ్యాహ్నం మూడున్నర సమయంలో విచారణ ప్రారంభమైన తర్వతా  రేపటి నుంచి వేసవి సెలవులు ఉన్నాయని ఈ రోజు వాదనలు వినిపించినా తీర్పు ఇవ్వడం కుదరదని న్యాయమూర్తి ఇరుపక్షాల లాయర్లకు స్పష్టం చేశారు.  వెకేషన్ బెంచ్ కు మార్చుకుంటారా అని పార్టీలను అడిగిన న్యాయమూర్తి ... ప్రధాన న్యాయమూర్తి ఎదుట మెన్షన్ చేసి ఆర్జెన్సీ ఉందని చెప్పాలని సూచించారు. 


వెకేషన్ బెంచ్ ముందు మెన్షన్ చేసుకోవచ్చన్న సీజే బెంచ్ 


ఈ రోజు వాదనలు విన్నా ఆర్డర్ ఈ రోజు ఇవ్వలేను..వేసవి సెలవుల తర్వాతే ఆర్డర్ ఇవ్వగలననన్నారు.  బెయిల్ పిటిషన్ పై తీర్పు అన్నిరోజులు రిజర్వ్ లో పెట్టడం బాగుండదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అవినాష్ తరపు లాయర్లు సీజేఐ బెంచ్  ముందు ప్రస్తావించారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని సీజేఐ స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కామెంట్స్ చూసిన తర్వాత  కూడా ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని  హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. రెండు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని అవినాష్ తరపు లాయర్లు కోరారు.అయితే ్లాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. వెకేషన్  బెంచ్ ముందు మెన్షన్ చేసుకోవచ్చని సూచించింది. 


సీబీఐ అరెస్ట్ చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేనట్లే !


ముందస్తు బెయిల్‌ ఇస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి  వేసింది . ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం జరగలేదు పైగా సీబీఐ తన పని తాను చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంటే సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చని చెప్పినట్లయిందని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. సాంకేతికంగా న్యాయపరంగా అవినాష్ అరెస్టును అడ్డుకునే ఉత్తర్వులేమీ లేవు. అందుకే .. సీబీఐ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలంటే ఎప్పుడైనా తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 


రెండు వారాల రిలీప్ అడిగినా దక్కని ఊరట


కనీసం రెండు వారాల పాటు అయినా రిలీఫ్ ఇవ్వాలని.. కస్టోడియల్ ఇంటరాగేషన్ కు కూడా రెడీ అని అవినాష్ తరపు లాయర్లు వాదించినప్పటికీ  ఎలాంటి ఆదేశాలను న్యాయమూర్తి ఇవ్వలేదు. వేసవి సెలవుల తర్వాతే తదుపరి విచారణ జరగనుంది.  ఈ తీర్పు ఓ రకంగా అవినాష్ రెడ్డికి షాక్ లాంటిదే. అరెస్ట్ కాకుండా ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.   సీబీఐ చాలా సార్లు విచారణలో ఆయనను అరెస్ట్ చేసి తీరుతామని ప్రకటించింది.  ఇప్పుడు న్యాయ పరంగాఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో సీబీఐ అరెస్ట్ చేస్తుందా లేకపోతే వేచి చూస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.