Teeth Set Stucked In Stomack During Sleep: విశాఖ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. నిద్రలో ఓ వ్యక్తి పొట్టలోకి పళ్ల సెట్టు వెళ్లిపోగా సర్జరీ చేసి తొలగించారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ (Visakha) నగరానికి చెందిన ప్రకాశ్ (52) పళ్ల సమస్య కారణంగా మూడేళ్ల క్రితం పళ్ల సెట్టు పెట్టించుకున్నారు. వారం రోజుల క్రితం నిద్రిస్తోన్న సమయంలో పళ్ల సెట్టు ఊడి పొట్టలోకి వెళ్లిపోయింది. దగ్గు అధికంగా రావడంతో విశాఖ షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిని సంప్రదించారు. పరీక్షించిన పల్మనాలజిస్ట్ సీహెచ్ భరత్ రోగికి స్కానింగ్ చేసి కుడి పక్క ఊపిరితిత్తుల వద్ద పళ్ల సెట్టు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రిజిడ్ బ్రాంకోస్కోపి అనే పరికరం సాయంతో పళ్ల సెట్టును తొలగించారు. పళ్లకు రెండు వైపులా లోహం ఉందని.. జాగ్రత్తగా తొలగించకుంటే ఊపిరితిత్తులకు, శ్వాస నాళాలకు ఇబ్బందయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎలాంటి సమస్య లేకుండా పళ్ల సెట్టు తొలగించామని.. రోగి కోలుకున్నారని తెలిపారు.
Also Read: Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!