ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ టీడీపీ చేపట్టిన 'రైతుకోసం తెలుగుదేశం' కార్యక్రమం మూడో రోజు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు పార్లమెంట్ స్థానాల పరిధిలో కొనసాగింది. మూడో రోజు నిరసనల్లో భాగంగా టీడీపీ నేతలు ఆయా పార్లమెంట్ స్థానాల పరిధిలో ఆందోళనలు నిర్వహించారు. తెలుగుదేశం సీనియర్‌ నేత బీసీ జనార్దన్‌ రెడ్డి ఈ నిరసనలకు నేతృత్వం వహించారు. రైతుల సమస్యలను తీర్చాలని కోరుతూ.. స్థానిక టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని తెలుగు తమ్ముళ్లు భారీ ర్యాలీలు చేపట్టారు. ప్లకార్డులు పదర్శిస్తూ.. రైతులకు జరిగిన అన్యాయాలపై గళం విప్పారు.


ప్రభుత్వం తక్షణమే రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంట్‌లో అన్ని ధాన్యాలకు మద్దతు ధరను పెంచి.. వరికి పెంచకపోతే వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఏమీ చేస్తున్నారని వారు నిలదీశారు. వ్యవసాయ ఖర్చులు పెరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజలు, రైతులు అధికార వైఎస్సార్‌సీపీకి  తగిన బుద్ధి చెబుతారని ఆరోపించారు. 


నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు..
'రైతుకోసం తెలుగుదేశం' కార్యక్రమాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. నేడు (సెప్టెంబర్ 17) ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగు దేశం పార్టీ నేతలు రైతుల కోసం ఆందోళనలు నిర్వహించనున్నారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో ఈ రోజు నిరసనలు కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. స్థానిక ప్రార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించిన అనంతరం.. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందిస్తారు.







Also Read: KRMB GRMB Meet: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉపసంఘాల సమావేశం... నేడు హైదరాబాద్ లో భేటీ... గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చ


Also Read: ZPTC, MPTC Votes Counting: 19న ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్‌.. ఎస్ఈసీ నోటిఫికేషన్..