AP Assmebly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండో రోజు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులను సస్పెండ్ చేశారు. రెండో రోజు సభ ప్రారంభం కాగానే పెరిగిన ఛార్జీలు, పన్నులపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. ఇరుపక్షాల వారు గట్టిగా కేకలు వేసుకున్నారు. ఈ సందర్భంగా వెల్ లోకి టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకుపోయారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను చుట్టుముట్టారు.టీడీపీ సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని మండిపడ్డారు. ప్రతి రోజు సభ సజావుగా కొనసాగకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. 


టీడీపీ సభ్యులు సభను అడ్డుకుంటున్నారని స్పీకర్ తమ్మినేని ఆగ్రహం 


సభలో మీరు మాత్రమే సభ్యులా? ఇతరులు సభ్యులు కాదా? అని ప్రశ్నించారు. సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. టీడీపీ సభ్యుల తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందని చెప్పారు. టీడీపీ సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని... దానికి అనుగుణంగా తాను చర్యలు తీసుకుంటానని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గనను స్పీకర్ కోరారు. తర్వాత   టీడీపీ సభ్యులపై  ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే వారు బయటకు వెళ్లకపోవడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ ది మార్షల్స్ అండ్ పుల్ దెమ్ అవుట్ అని ఇంగ్లిష్‌లో ఆవేశంగా స్పందించారు. 


విభజన చట్టంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని లేదని.. పరిశీలించాలనే ఉందని  సభకు చెప్పిన బుగ్గన 


అంతకు ముందు  ప్రశ్నోత్తరాల సమయంలో కడప స్టీల్‌ప్లాంట్‌పై టీడీపీ సభ్యులు కడప స్టీల్ ప్లాంట్‌పై ప్రశ్నిచారు.  కేంద్రాన్ని ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించట్లేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అధికారపక్ష సభ్యులను ప్రశఅనించారు. . దీనిపై మంత్రి బుగ్గన సమాధానం ఇచ్చారు.  టీడీపీ సభ్యులు సబ్జెక్టుకు కన్పైన్ కావడం లేదన్నారు. కడప స్టీల్ పెట్టేందుకు ఆలోచించొచ్చు అని  విభజన చట్టంలో ఉందన్నారు. కోవిడ్ వల్ల ప్రపంచ వ్యీప్తంగా స్టీల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నదని వెల్లడించారు. విభజన చట్టంలో ఏముందో సరిగా చూడాలన్నారు.  మంత్రి అమర్నాథ్  రెండున్నర సంవత్సరాలు పాటు కోవిడ్ వల్ల ఆలస్యం అయ్యింది. ల్యాండ్‌కు సంభందించి ముప్పై ఏడున్నర కోట్లు కాంపన్షేషన్ చెల్లించాం’ అని సమాధానం ఇచ్చారు. 


రోజా మాటలను వక్రీకరించారు - ఆమెకు దళితులంటే ఎంతో గౌరవమన్న మంత్రి నాగార్జున !


చర్చలపై ఎవరి వాదన వారిదే.. సస్పెన్షన్ వేటుకే అధికారపక్షం మొగ్గు !


తెలుగుదేశం పార్టీ సభ్యులను గతంలోనూ వరుసగా సస్పెండ్ చేస్తూ వెళ్లారు. ఈ సమావేశంలోనూ సస్పెండ్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తాము ప్రతిపాదించిన వాటిపై చర్చించాలని పట్టుబడుతున్నారు. అయితే అధికార పార్టీ మాత్రం అన్నీ చర్చిద్దాం కానీ.. విడిగా సమయం కేటాయిస్తామని చెబుతోంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు వరుసగా సస్పెండ్ అవుతూండటంతో  సభ ఏకపక్షంగా సాగుతోంది.  అర్థవంతమైన చర్చలు జరగకపోవడంతో  రాజకీయ వర్గాల్లోనూ అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తి కనిపించడం లేదు. 


ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల, ఆయనకే ఛాన్స్ !