Vizag TDP Leaders : ఉత్తరాంధ్ర లో నీటి ప్రాజెక్ట్ లు ఆగిపోయాయని ప్రభుత్వంపై విశాఖ టీడీపీ నేతలు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు హయాంలో 70 శాతం పూర్తి అయిందని.. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి పొలవరాని భ్రష్టు పట్టించి రివర్స్ పాలన లో ప్రాజెక్ట్స్ నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని.. 71 శాతం చంద్రబాబు పోలవరం నిర్మాణం చేస్తే 4 మాసాల్లో పోలవరం పూర్తి చేయలేక ప్రజలను మభ్య పెడుతున్నారని టీడీపీ నేత , మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. జలశక్తి శాఖ చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఈ విషయం లో కపట నాటకాలు ఆడుతున్నారని .... కేసీఆర్ కి భయపడి ఆయనకు సాయం చేయడానికి ఆంధ్ర ప్రజల పీక కొస్తున్న దుర్మార్గపు వ్యక్తి జగన్ అని బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు.
ప్రభుత్వానికి రైతుల గురించి ఏమీ తెలియదు : బండారు
దొంగ వ్యాపారాలు దొంగ సూటికేసులు గురుంచి తప్ప రైతుల గురించి తెలుసా అని ప్రశ్నించారు. సన్నాసులు అసెంబ్లీ లో ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. సరైన నీరు ఉంటేనే రాష్ట్రంలో పరిశ్రమ లు రైతులు బాగుంటారని.. పోలవరం కి జరిగిన అన్యాయం పై అన్ని పార్టీల కలిసి అఖిలపక్షం గా ఏర్పడి విశాఖ నుండి పోలవరం వరకు పాదయాత్ర చేస్తామని ప్రకటించారు. పోలవరం పై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బండారు సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ గొంతు కోస్తున్నారు : పల్లా
పోలవరం ప్రాజెక్ట్ పై ముఖ్యమంత్రి స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నాడని మరో టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. పోలవరం డ్యాం ఎత్తు 150 అడుగుల నుంచి 135 అడుగులకు కుదించి ప్రాజెక్ట్ ను పూర్తువచేస్తున్నామని ప్రజలకు మభ్యపెడుతున్నారన్నారు. ఎత్తు తగ్గించడం వలన ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పై తెలంగాణ సీఎం కెసిఆర్ ను సంతోష పరచడానికి జగన్ వ్యవహరిస్తున్నడని.. ఎత్తు తగ్గిస్తే 72 టీఎంసీ లైవ్ స్టోరేజ్ కోల్పోతున్నామన్నారు. హైట్ లో వుంటే గ్రావిటీ తో ఫ్లో వస్తుందని.. పోలవరం ప్రాజెక్ట్ పై అందరం కలసి పోరాటం చెయ్యడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
తొలి దశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు తెలిపిన కేంద్రం
పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేసింది. తొలి దశలో పోలవరం ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమని స్పష్టం చేసింది. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని తేల్చి చెప్పింది. వైసీపీ ఎంపీ సత్యవతి లోక్ సభ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. తొలిదశ సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023కే పూర్తి కావాల్సి ఉందని, తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023 నాటికే ఇవ్వాల్సి ఉందని.. దానిని కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదని ప్రహ్లాద్ సింగ్ పటేల్ అన్నారు. కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఏపీ ప్రభుత్వం కల్పించినట్లు చెప్పారు. మిగతావారికి సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇంతవరకు చేయలేదని ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు.