Land-For-Jobs Scam Case:


సీబీఐ విచారణ..


బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్ ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌ విచారణలో భాగంగా సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే ఆయనకు రెండు సార్లు సమన్లు జారీ చేసింది సీబీఐ. అయితే రెండు సార్లూ విచారణకు హాజరు కాలేదు తేజస్వీ. ఆయనతో పాటు లాలూ కూతురు RJD ఎంపీ మీసా భారతి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున తమ పేరిట భూములు రాయించుకున్నారని ఆరోపిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను కూడా విచారించారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ ఈ స్కామ్‌లో భాగస్వామ్యం ఉందని సీబీఐ చెబుతోంది. లాలూ భార్య రబ్రీదేవిని కూడా అధికారులు విచారించారు. మార్చి 25న విచారణకు వస్తానని చెప్పిన తేజస్వీ యాదవ్..ఆ మేరకు హాజరయ్యారు. ఈ ఇన్వెస్టిగేషన్‌పై స్పందించిన తేజస్వీ యాదవ్...పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 


"దర్యాప్తు సంస్థలకు మొదటి నుంచి సహకరిస్తూనే ఉన్నాం. కానీ ప్రస్తుతం దేశం రాజకీయాలు సంక్లిష్టంగా మారినట్టు కనిపిస్తోంది. తలొంచడం సులువే. కానీ పోరాడడం మాత్రం అంత సులువు కాదు"


- తేజస్వీ యాదవ్, బిహార్ డిప్యుటీ సీఎం