TDP News : చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ.. ప్రతీ ఆదివారం వినూత్న నిరసనలకు తెలుగుదేశం పార్టీ  పిలుపునిస్తోంది. ప్రతీ ఆదివారం సాయత్రం ఏడు గంటలకు వినూత్న నిరసనలను టీడీపీ నేతలు చేపడుతున్నారు. ఈ ఆదివారం కూడా నిజం గెలవాలి... చంద్రబాబు గారికి వేసిన సంకెళ్లు బద్దలు కావాలని..   అది జరగాలంటే జగనాసురునికి కనువిప్పు కావాలని కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చారు.  అక్టోబర్ 29, 2023... ఆదివారం రాత్రి 7 గంటలకు కళ్ళకు గంతలు కట్టుకుందాం. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి చంద్రబాబుగారికి మద్దతుగా "నిజం గెలవాలి" గట్టిగా అరుద్దామని టీడీపీ పిలుపునిచ్చింది. 


 





చంద్రబాబు అరెస్ట్ పై  ప్రతి ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్న నిరసనలు వినూత్నంగా ఉండేలా చూసుకుంటున్నారు.  చంద్రబాబు అరెస్టుపై మహిళలు, యువతలో నిరసన  అధికంగా ఉందని, వీరు బయటకు రావడం వల్లే  ఈ కార్యక్రమాలు అన్నీ సక్సెస్ అవుతున్నాయని టీీపీ ్ంటున్నారు.  ప్రతిపక్షంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ అనేక సందర్భాల్లో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. వీటిలో పార్టీ నేతలు, స్థానికంగా చురుగ్గా ఉండే కార్యకర్తలే తరచూ పాల్గొంటున్నారు.  కాని చంద్రబాబు అరెస్టు తర్వాత ఈ వాతావరణం మారిందని సామాన్యప్రజలు పాల్గొంటున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో ఇచ్చే పిలుపుతో వేల మంది చంద్రబాబుకు సంఘిభావం తెలియచేస్తున్నారని అంటున్నారు.  చంద్రబాబు అరెస్టు అయ్యి ఇప్పటికి 50 రోజులైనా టీడీపీ శ్రేణులు నిరసనల్లో విశ్రమించలేదు. రిలే నిరాహార దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు అవిశ్రాంతంగా కొనసాగిస్తున్నారు.


 






 


టీడీపీ పిలుపునిచ్చే కార్యక్రమాలన్నింటినీ సోషల్ మీడియాలో సీనియర్ నేతలందరూ  ప్రచారం కల్పిస్తున్నారు.