Achanta tdp meeting: బాబాయి హత్యలో చెల్లిపై కేసు పెట్టడం, మద్య నిషేధం అని చెప్పి.... మద్యంపై అప్పు తేవడం, సిపిఎస్ రద్దు అని... జీతాలు కూడా ఇవ్వకపోవడమే ఏపీ సీఎం జగన్ విశ్వసనీయత అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు (Tdp Chief Chandrababu) ఎద్దేవా చేశారు. మూడు నెలల్లో జగన్ (YS Jagan) ప్రభుత్వం క్లీన్ బౌల్డ్ అవ్వడం ఖాయం అన్నారు. జగనన్న వదిలిన బాణం షర్మిల (Sharmila)... ఇప్పుడు జగన్ వైపు తిరిగింది, అసమర్థ, అవినీతి మంత్రులతో జగన్ క్యాబినెట్ నిండిపోయింన్నారు. వైసీపీలో బూతు రత్నలకు, బూతు సామ్రాట్ లకు ఎమ్మెల్యే టిక్కెట్లు, మంత్రి పదవులు దక్కుతాయంటూ సెటైర్లు వేవారు. 
ఏపీకి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్ దే..
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట లో నిర్వహించిన ‘రా...కదలిరా’ బహిరంగ సభ చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. జగన్ రెడ్డి మూడు రాజధానుల కేసులను సుప్రీంకోర్టు ఏప్రిల్ కు వాయిదా వేసింది. జగన్ టైమ్ ముగిసిందన్నారు. అమరావతే మన రాజధాని... ఇది తథ్యమన్నారు. గత 5 ఏళ్లుగా ఏపీకి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు. బాబాయ్ వివేకానందరెడ్డిని చంపేసి... నారాసుర రక్తచరిత్ర అని తప్పుడు రాతలు రాశారు. నేడు వివేకా కుమార్తెపై తప్పుడు కేసులు పెట్టి జగన్ రెడ్డి వేధించడం నిజం కాదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ మరణానికి రిలయన్స్ అధినేత కారణమంటూ రిలయన్స్ మాల్స్ పై దాడులు జగన్ రెడ్డి చేయించాడని.. కానీ ముఖేష్ అంబాని ఏపీకి వస్తే ఆహ్వానించి.. నత్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చారని గుర్తుచేశారు. దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. తన ఆస్తులపై సమాధానం చెప్పే ధైర్యం ఉందా? అని ఏపీ సీఎంను చంద్రబాబు ప్రశ్నించారు.


ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన మహనీయుడు దీర్ఘ దృష్టివల్ల దేశానికే అన్నపూర్ణగా పశ్చిమగోదావరిజిల్లా విలసిల్లుతోంది.. ఇలాంటి జిల్లాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. గోదావరి జిల్లా ప్రజల మంచితనం మరువలేనిది. అతిథులను గౌరవించడంలో వీరిని మించిన వారు లేరని దివంగత ఎన్టీఆర్ ఎప్పుడూ చెప్పేవారు. 2014లో 15కి 15 అసెంబ్లీలు, 3కి 3పార్లమెంటులు గెలిపించారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేనల జైత్రయాత్రను ఇక్కడినుండే ప్రారంభించబోతున్నాం అన్నారు. మొట్టమొదటిసారిగా ఒకే ఒకసారి 2019లో తప్పటడుగు వేశారని వ్యాఖ్యానించారు.




జగన్ పై చంద్రబాబు చెప్పిన పిట్ట కథ..
‘నాకు ఒక కథ గుర్తుకు వస్తుంది.. గతంలో ఒక వ్యక్తి సైకిల్ ఎక్కి ఎలాంటి ఖర్చు లేకుండా ఆనందంగా తిరుగుతూ ఉండేవాడు. ప్రయాణం సాఫీగా సాగేది. ఆ సమయంలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ ఎక్కించుకుని వెళ్లి స్వర్గం చూపిస్తానని చెప్పాడు. కొంత దూరం వెళ్లాక పెట్రోల్ అయిపోయి బైక్ ఆగిపోతే పెట్రోల్ పోయించాలని చెప్పాడు. కొంత దూరం వెళ్లాక మోటార్ బైక్ చెడిపోతే బాగు చేయించాడు. చీకటి పడ్డాక బైక్ ఎక్కిన వ్యక్తిని పూర్తిగా దోచుకుని ఆ బైక్ గల వ్యక్తి పారిపోయాడు. ఆ దోచుకున్న వాడే జగన్’ అంటూ చంద్రబాబు తన కథను ముగించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు కరెంటు, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచం అని చెప్పి.. ఇష్టానుసారం రేట్లు పెంచి దోచేస్తున్నాడు. పెట్రోల్ ఛార్జీలు పెంచాడు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసేశారు. రోడ్లు పాడైపోతే కనీసం పట్టించుకునేవారు లేరు. అభివృద్ధిని గాలికొదిలేశారంటూ మండిపడ్డారు.




పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వారంగానికి నెలవు.. పెద్దఎత్తున ఆక్వా పంట ఉంది. జగన్ పాలనలో ఆక్వారంగం ధ్వంసమైంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పశ్చిమ గోదావరిలో ఆక్వారంగానికి పెద్దపీట వేశానని, రాయలసీమలో హార్టీకల్చర్ ను ప్రోత్సహించి లాభాలు వచ్చేలా చేశానన్నారు. టీడీపీ పాలనలో 2లక్షల ఎకరాల్లో సాగు పెంచాం. వైసీపీ పాలనలో ఆక్వారంగంలో సాగు ఖర్చు 3రెట్లు పెరిగింది. మద్దతు ధర లేదు. కరెంటు బిల్లు, ఫీడ్, సీడ్, మందులు, సెస్ ధరలు పెంచారు. జోన్లుగా ఆక్వారంగాన్ని విభజించి..నాన్ జోన్ లో ఉంటే యూనిట్ పై రూ.3.50చేశారు. 10ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయం ఉంటే అడ్డగోలుగా కరెంటు ఛార్జీలు పెంచేశారు. ఆక్వా రైతులకు జోన్, నాన్ జోన్ తో సంబంధం లేకుండా యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామన్నారు. 


నీళ్లు ఉంటే క్రాప్ హాలిడే ప్రకటించిన పరిస్థితి వైసీపీది. దేశంలో అత్యధిక అప్పులు ఉన్న రైతుల్లో ఏపీ రైతులు ముందు వరుసలో ఉన్నారు. కౌలురైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 2వ స్థానంలో ఉంది. రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 3వ స్థానంలో ఉంది. ఈ నాలుగున్నరేళ్లలో రైతులు పడరానిపాట్లు పడ్డారు. కనీసం పంట అమ్ముకునేందుకు గోనె సంచులు కూడా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు.


తాను సీఎంగా ఉన్నప్పుడు పోలవరం పనులను పరుగులు పెట్టించి 72శాతం పనులు పూర్తిచేయగా.. అసమర్థుడు జగన్ సీఎం అవ్వడం వల్ల పోలవరానికి గ్రహణం పట్టిందంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో డయాఫ్రం వాల్ రెండు సీజన్లో వరదలో దెబ్బతింటే దాన్ని పట్టించుకునేవారు లేరు. కాఫర్ డ్యామ్ లలో నీళ్లు వచ్చేశాయి...గైడ్ బండ్ కుంగిపోయింది. పోలవరాన్ని పూర్తిచేసుకుని రాష్ట్రంలో నదులను అనుసంధానం చేయడంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో 3 పంటలు వేసుకునేందుకు నీళ్లు ఇచ్చే బాధ్యతను టీడీపీ, జనసేన తీసుకుంటుందని రైతులకు హామీ ఇచ్చారు. 




‘ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి జగన్ రెడ్డే సాక్షాత్తూ మెడలు వంచి దండాలు పెట్టాడు. మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి... అధికారంలోకి వచ్చాక భూమ్ భూమ్ వంటి నాసిరకం మద్యం తెచ్చి, రేట్లు పెంచి దోచుకుంటున్నాడు. మద్యాన్ని తాకట్టు పెట్టి 25ఏళ్లకు అప్పులు తెచ్చాడు జగన్. సీపీఎస్ ను సీఎం అయిన వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పి నేటికీ చేయలేదు.  అంగన్వాడీలంతా నేడు రోడ్లపై ఉన్నారంటే దానికి ముఖ్యమంత్రి, అసమర్థ ప్రభుత్వమే కారణం. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలిస్తానని, డీఎస్సీ ఇస్తానని, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి నేటికీ ఇవ్వలేదు. కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పిన జగన్ రెడ్డి నేటికి 9సార్లు పెంచాడు