Talliki Vandanam Date 2026: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ ఏడాది నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జులై 10, 2026న తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
కీలక మార్పులు
గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ ఈసారి ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో ఒకే బిడ్డకు పరిమితమైన ఈ పథకాన్ని, ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా వారందరికీ వర్తింపజేయనున్నారు. ఇది చదువుకునే పిల్లలున్న ప్రతి కుటుంబానికి పెద్ద ఊరటనిచ్చే విషయమనే ప్రభుత్వం భావిస్తోంది.
ఎంత నగదు జమ చేస్తారు?
తల్లికి వందన పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.13,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధికి అందిస్తుంది.
Also Read: మహిళలకు కూటమి ద్రోహం - రూ. 6,000 కోట్లు నొక్కేశారు.. గణాంకాలతో వైఎస్ జగన్ సంచలన ట్వీట్!
ఈ నిబంధనలు తప్పనిసరి
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
- పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు కలిగి ఉండాలి.
- లబ్ధిదారులైన తల్లుల బ్యాంక్ అకౌంట్లకు ఇ-కేవైసీ ప్రక్రియ పూర్తి అయ్యి ఉండాలి.
- NPCI లింక్ కూడా ఉండాలి.
వెంటనే e-KYC పూర్తి చేసుకోండి
అర్హత ఉండి, ఇంకా బ్యాంక్ అకౌంట్ ఇ-కేవైసీ పూర్తి కాని వారు వెంటనే తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. జులై 10 లోపు ఇ-కేవైసీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి మాత్రమే నిధులు సకాలంలో జమ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు.
Also Read : కడప స్టీల్ ప్లాంట్‌కు ఇంకెన్ని సార్లు శంకుస్థాపనలు? బ్రాహ్మణి నుండి JSW వరకు.. చంద్రబాబు తాజా ప్లాన్ ఏంటి?
