వివేక హత్య కేసులో సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు తీసుకుంది. దీనిపై మంగళవారం విచారణ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో అవినాష్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌ ఇవ్వడంపై పిటిషన్ వేశారు సునీత. 


వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన కుట్రదారుడని సుప్రీంకోర్టుకు తెలిపారు సునీత తరఫున న్యాయవాది. అలాంటి వ్యక్తికి ముందస్తు బెయిల్ ఇవ్వడం సరికాదని చెప్పారు. మీడియాలో వచ్చిన స్టోరీలు ఆధారంగా హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చిందని తెలిపారు. 
వివేకా హత్య కేసు విచారణకు అడుగడుగునా అవినాష్ రెడ్డి అడ్డుకుంటున్నారని వాదించారు సునీత తరఫున న్యాయవాది. స్థానిక ప్రభుత్వం కూడా ఆయనకు మద్దతు ఇస్తోందని అన్నారు. సీబీఐ విచారణ జరగకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఏప్రిల్‌్ 24 తర్వాత నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అవినాష్ రెడ్డి విచారణకు వెళ్లలేదని గుర్తు చేశారు. సునీత పిటిషన్‌ను విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు విచారణ మంగళవారం చేపట్టబోతున్నట్టు వెల్లడించారు.