Tungabhadra Dam:  రాయలసీమ ప్రజల నీటి అవసరాలను తీర్చే తుంగభద్ర కరుణించింది. తుంగభద్ర ప్రాజెక్టు  19వ ఫస్ట్ గేట్ కొట్టుకపోవడంతో డ్యామ్ లో సుమారుగా 45 టీఎంసీల నీరు వృధా అయింది. 19వ ట్రస్ట్ గేట్ బిగించడంతో నీటి వృధాకు అధికారులు అడ్డుకట్ట వేశారు. గేటు బిగించిన నాటి నుంచి తుంగభద్ర జలాశయంలోకి యావరేజ్ ఇన్ ఫ్లో  రావడంతో రోజురోజు జలాశయంలోని నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 100 టీఎంసీల నీరు తుంగభద్ర జలాశయం కి చేరడంతో అధికారులతో పాటు రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 101 టిఎంసి నీరు కొనసాగుతూ ఉంది. 


తుంగభద్ర క్యాచ్ మెంట్ ఏరియాలో వర్షాలు


తుంగభద్ర జలాశయం ఎగువ భాగాన ఉన్న తుంగ, భద్ర జలాశయాలు పూర్తిస్థాయిలో నిండడంతో ఆ రెండు జలాశయాల నీటిని దిగువకు వదులుతూ ఉండడంతో తుంగభద్ర జలాశయానికి నీటి ఇన్ ఫ్లో పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన తుంగభద్ర డ్యాం అధికారులు   దిగున ఉన్న నది పరివాహక ప్రాంతాల గ్రామాలను ప్రజలను అప్రమత్తం చేశారు. ఏ సమయంలోనైనా తుంగభద్ర జలాశయం నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని నది పరివాహక ప్రాంత ప్రజలందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. 


హీరోయిన్లూ... బాధ్యత ఉండక్కర్లా? అనన్య నాగళ్ళ, స్రవంతిని చూసి సిగ్గు పడండి - కోట్లు కావాలి, ప్రజల కష్టాలు పట్టవా?


రైతులకు ఈ ఏడాది చింతలు లేనట్లే 


తుంగభద్ర జలాశయం నిండటంతో ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి. వంద టీఎంసీలకుపైగా నీటి నిల్వలతో జలాశయం కళకళ లాడుతోంది. జలాశయం ఎగువ భాగాన ఉన్న తుంగ, భద్ర, వరద నదుల నుంచి ఇనఫ్లో పెరుగుతోంది. డ్యాం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలుగా.. ప్రస్తుతం జలాశయంలో 101 టీఎంసీలు నీరు చేరాయి.  గతం లో ఎగువ కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు హోస్పేటలోని తుంగభద్ర జలాశయంలోకి అనుకున్న స్థాయి కంటే ముందుగానే నీటి ప్రవాహం వేగంగా కొనసాగింది. దీంతో ఒక్కసారిగా ఖాళీగా ఉన్న జలాశయంలోకి నీటి మట్టం అమాంతం పెరిగిపోయింది.


తుంగభద్ర జలాశయం నీటి కెపాసిటీ 105 టీఎంసీలు. ఎగువన కురిసిన భారీ వర్షాలకు 105 టీఎంసీల వరద నీరు కేవలం తక్కువ రోజుల్లోనే జలాశయంలోకి చేరుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విడతల వారీగా డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీరు వదిలారు. తుంగభద్ర జలాశయం కి పూర్తిస్థాయిలో నీరు రావడంతో తుంగభద్ర జలాశయం కింద ఉన్న ఆయకట్టు రైతులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతలోనే తుంగభద్ర కు 19వ గేట్ కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందారు. 


చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ లీడర్లకు షాక్ ఇచ్చిన హైకోర్టు


ఆదుకున్న కన్నయ్య నాయుడు  
 
డ్యామ్ లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉండడంతో ఈసారి తమ వ్యవసాయ అవసరాలకు నీరు పుష్కలంగా లభిస్తుంది అనుకున్న తరుణంలో డ్యాం గేటు కొట్టకపోవడంతో ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. 105 టీఎంసీల పూర్తి కెపాసిటీతో ఉన్న డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో సుమారు 50 టీఎంసీల నీరు వృధాగా నదిలోకి పోయింది. 19వ గేటును బిగించాలి అంటే డ్యామ్ లో సుమారుగా 40 శాతం నీరు దిగువకు వెళ్లాల్సి ఉంటుందని మొదట అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చొరవతో జలాశయాల డ్యామ్ గేట్ల ప్రత్యేక నిపుణుడు కన్నయ్య నాయుడు రంగంలోకి దిగారు. పూర్తిగా డ్యాముని పరిశీలించి డ్యామ్ అధికారులు.. కన్నయ్య నాయుడు నీటి ప్రవాహం కొనసాగుతూ ఉన్న సమయంలోనే డ్యాం గేట్లను నాలుగు భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని నీటి ప్రవాహంలోనే అమర్చే విధంగా పనులను కొనసాగించారు. ఆ పనులు వేగవంతంగా పూర్తి కావడం 19వ ట్రస్ట్ గేటును నాలుగు భాగాలను గేటుగా అమర్చడంతో నీటి వృధాను ఆపడంలో కన్నయ్య నాయుడు సక్సెస్ అయ్యారు.