Union government funds to states: ఏపీలో బీజేపీ అగ్రనేతల పర్యటన మరుసటిరోజే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. రాష్ట్రాలకు 3వ విడత పన్ను నిధులను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. కేంద్ర పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా కింద కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్‌ నెలకు గానూ 3వ విడత కింద మొత్తం రూ.1,18,280 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. జూన్‌ చెల్లింపులతో పాటు ఒక విడత అడ్వాన్స్‌ మొత్తాన్ని విడుదల చేసినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లు వచ్చాయి.


ఈ నిధులను అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగవంతానికి వినియోగించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కాగా, కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం వాటాను రాష్ట్రాలకు అందిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో 14 విడతల్లో కేంద్రం రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని విడుదల చేస్తుంది.


రాష్ట్రాలకు 3వ విడత పన్ను నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ కు రూ.21,218 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్ - రూ.4,787 కోట్లు
తెలంగాణ - రూ.2,486 కోట్లు
అరుణాచల్ ప్రదేశ్ - రూ.2,078 కోట్లు
అస్సాం - రూ.3,700 కోట్లు
బిహార్ - రూ.11,897 కోట్లు
ఛత్తీస్ గఢ్  - రూ.4,030 కోట్లు
గోవా  - రూ.457 కోట్లు
గుజరాత్  - రూ.4,114 కోట్లు
హర్యానా  - రూ.1,293 కోట్లు
హిమాచల్ ప్రదేశ్  - రూ.982 కోట్లు
ఝార్ఖండ్   - రూ.3,912 కోట్లు
కర్ణాటక   - రూ.4,314 కోట్లు
కేరళ  - రూ.2,277 కోట్లు
మధ్యప్రదేశ్   - రూ.9,285 కోట్లు
మహారాష్ట్ర  - రూ.7,472 కోట్లు
మణిపూర్   - రూ. కోట్లు
మేఘాలయ   - రూ. కోట్లు
మిజోరం   - రూ. కోట్లు
నాగాలాండ్   - రూ.673 కోట్లు
ఒడిశా   - రూ.5,356 కోట్లు
పంజాబ్   - రూ.2,137 కోట్లు
రాజస్థాన్   - రూ.7,128 కోట్లు
సిక్కిం   - రూ.459 కోట్లు
తమిళనాడు   - రూ.4,825 కోట్లు
త్రిపుర   - రూ.8,37 కోట్లు
ఉత్తరాఖండ్   - రూ.1,322 కోట్లు
పశ్చిమ బెంగాల్   - రూ.8,898 కోట్లు
మొత్తం   - రూ.1 లక్షా 18 వేల 2 వందల 80 కోట్లు


విభజన చట్టంలోని హామీల మేరకు ఇప్పటి వరకూ ఏపీకి రూ.23,110.47 కోట్లు ఆర్థిక సాయం చేశామని డిసెంబరులో కేంద్రం ప్రకటించింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5617.89 కోట్లు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.1750 కోట్లు, రాజధాని నిర్మాణం కోసం రూ.2500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 13,226.772 కోట్లు ఏపీకి ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2015-20 మధ్య కాలంలో ఏపీ సంతకాలు చేసిన విదేశీ ప్రాజక్టులపై తీసుకున్న రుణాలకు రూ.15.81 కోట్ల వడ్డీ చెల్లింపులు కూడా విడుదల చేసినట్లు వెల్లడించారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద 2019-20 నుంచి 2022-23 మధ్య ఏపీకి రూ.4199.55 కోట్లు విడుదల చేశామన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చామని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. విభజన చట్టంలోని నిబంధనలు, నీతి ఆయోగ్ సిఫార్సులతో ఏపీకి ఆర్థికసాయం అందిస్తున్నామని కేంద్రం వెల్లడించింది.