Sankranti Special Trains: హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలని నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ 2024 సందర్భంగా అదనపు రద్దీని క్లియర్ చేయడానికి పలు ప్రత్యేక రైలు సర్వీసుల (Special Trains During Pongal 2024)ను ఏర్పాటు చేసింది. వికారాబాద్ - బ్రహ్మపూర్ ల మధ్య, సికింద్రాబాద్ - బ్రహ్మపూర్ ల మధ్య రెండు చొప్పున ప్రత్యేక రైలు సర్వీసులను అధికారులు ఏర్పాటు చేశారు. వికారాబాద్ - బ్రహ్మపూర్ ల మధ్య ట్రెయిన్ నెంబర్ 07091, 07092 ప్రత్యేక రైలు, సికింద్రాబాద్ - బ్రహ్మపూర్ ల మధ్య ట్రెయిన్ నెంబర్ 07089, 07089 రైళ్లు సేవలు అందిస్తాయని ద.మ రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లతో పాటు స్టాప్ ల వివరాలు ఇలా ఉన్నాయి.
సంక్రాంతి రద్దీ దృష్ట్యా ద.మ రైల్వే కొన్ని మార్గాల్లో 20 ప్రత్యేక రైళ్లను ఇటీవల కేటాయించింది. ఈ రైళ్లను హైదరాబాద్ - తిరుపతి, కాచిగూడ - కాకినాడ టౌన్ రూట్లలో నడపనున్నారు. సికింద్రాబాద్ నుంచి రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇవి అనుకూలంగా ఉండనున్నాయి. ఈ నెల 28 నుంచి జనవరి 26 వరకూ ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక రైళ్లలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.
- కాచిగూడ - కాకినాడ టౌన్ (రైలు నెం - 07653) రాత్రి 8:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.
- కాకినాడ టౌన్ - కాచిగూడ (రైలు నెం - 07654) ఈ నెల 5న సాయంత్రం 5:10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4:50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ప్రయాణిస్తుంది.
- హైదరాబాద్ - తిరుపతి (రైలు నెం 07509) రాత్రి 7:25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 4, 11, 18, 25 తేదీల్లో అందుబాటులో ఉండనుంది.
- తిరుపతి - హైదరాబాద్ రైలు (07510) రాత్రి 8:15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 5, 12, 19, 26 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది.
- కాచిగూడ - కాకినాడ టౌన్ - కాచిగూడ ప్రత్యేక రైళ్లు (రైలు నెం. 07653/07654) మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.
- హైదరాబాద్ - తిరుపతి - హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు (రైలు నెం. 07509/07510) సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ. నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.