Konaseema District: పండగలకు ఎవరైనా తెలిసిన వారికి స్వీట్స్ పంచుతారు. ఎదైనా శుభకార్యం సందర్భంగా సారెగా ఓ వంద మందికో లేదా ఓ వెయ్యి మందికో స్వీట్స్ తయారు చేయించి పంపిణీ చేయిస్తారు. కానీ ఓ వైసీపీ నాయకుడు తన ప్రాంతవాసులకోసం ఏకంగా 14 టన్నుల స్వీట్ తయారు చేయించి మరీ పంచారు. ఈ స్వీట్‌ను కేజీ, అరకేజీ, పావు కేజీగా ప్లాస్టిక్ బాక్సుల్లో మరీ ఏర్పాటు చేసి అందించారు. గుడ్ సీడ్ ఫౌండేషన్ ద్వారా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఫౌండేషన్ అధినేత, సీనియర్ వైసీపీ నాయకుడు కుంచే రమణారావు గత పదేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవలే ఫౌండేషన్ వార్షికోత్సవ వేడుక నిర్వహించుకోగా ఈ ఏడాది అమలాపురం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు స్వీట్స్ పంచాలని నిర్ణయించారట.
ఈ నేపథ్యంలోనే 14 టన్నులు స్వీట్‌ను ప్రత్యేకంగా ఆర్డరు ఇచ్చి తయారు చేయంచారు.. ఈ స్వీట్ బాక్సులో పాలకోవ, నేతి లడ్డూ, కలాకండ్, మైసూర్ పాక్, రసగుల్ల, గులాబ్‌జామ్, సోంపాపిడి, బెల్లం లడ్డూ తదితర పది రకాలను కలగలపి ఒకే బాక్సులో నింపి అందించారు. ఈ విషయం నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.. అయితే గుడ్‌సీడ్ ఫౌండేషన్ ద్వారా ప్రతి క్రిస్మన్, ఇయర్ కు విధిగా స్వీట్ తోపాటు నిరుపేదలకు బట్టలు గత పదేళ్లుగా పంపిణీ చేస్తున్నారని తెలిసిన వారు చెబుతున్నారు.