ఇసుక రీచ్‌ల కోసమే డ్యామ్‌లను కొట్టుకుపోయేలా చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు.  కడప జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్ని సోము వీర్రాజు పరిశీలించారు. బాధితుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.  పింఛా, అన్నమయ్య డ్యాంలు  కొట్టుకుపోవడానికి వైఎస్ఆర్‌సీపీ నేతలే్ కారణం అని ఆరోపించారు. వారి ఒత్తిడి వల్లే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని... సరైన సమయంలో స్పందించలేదన్నారు.  


Also Read: విధి నిర్వహణలో మరో ప్రాణం బలి.. శవమై తేలిన సచివాలయ ఉద్యోగి..


ఇసుక రీచ్‌ల కోసం ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టారని మండిపడ్డారు. ఇలాంటి ఘోరమైన నష్టం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. నష్ట నివారణకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారికి సీఎం జగన్ రూ. ఐదు లక్షలు మాత్రమే పరిహారం ప్రకటించారని అది సరిపోదన్నారు. విశాఖలో జరిగిన ప్రమాదంలో ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం ప్రకటించారని గుర్తు చేశారు.  విశాఖలో రూ. కోటి ఇచ్చి సీఎం సొంత జిల్లా ప్రజలకు మాత్రం రూ. ఐదు లక్షలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. సర్వం కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 


Also Read: Kadiri Incident: అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే కదిరిలో ఆరుగురు చనిపోయారు.. విష్ణువర్ధన్ రెడ్డి


చనిపోయిన వారికి కాకుండా సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ. ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ముఖ్యమంత్రి నేల మీదకు దిగకుండా గాల్లోనే ఏరియల్ సర్వే చేశారని.. క్షేత్ర స్థాయిలో పర్యటించాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలోనూ పర్యటించి బాధితులను పరామర్శించాలన్నారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయి మద్దతు రాష్ట్రానికి లభిస్తుందని.. ఇప్పటికే ప్రధాని మోడీ జగన్‌తో మాట్లాడారని సోము వీర్రాజు గుర్తు చేశారు. 


Also Read: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన... కడప-అనంతపురం మధ్య రాకపోకలు బంద్


కడప, చిత్తూరుల్లోని వరద బాధిత ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. రహదారులు కూడా రెడీ కాలేదు. బాధితుల్ని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు విపక్ష నేతలు తరలి వస్తున్నారు. మంగళ, బుధవారాల్లో  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. తర్వాత సీఎం జగన్ కూడా పర్యటించే అవకాశం ఉంది.


Also Read: వరద విపత్తును ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొలేకపోయిందా ? సీఎం జగన్ తీరుపైనా విమర్శలు ఎందుకు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి