Trains Diverted In Vijawayada Division: విజయవాడలో రైల్వే ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో కాజీపేట - విజయవాడ - విశాఖ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 30 రైళ్లను విజయవాడ స్టేషన్‌కు రాకుండా నగర శివార్లలోని బల్బ్ లైన్ మీదుగా విశాఖ మార్గంలోకి మళ్లిస్తామని చెప్పారు. ఆగస్ట్‌లో దాదాపు 10 రోజుల పాటు హైదరాబాద్ - విశాఖ మధ్య ప్రయాణించే రైళ్లు విజయవాడ రాకుండా దారి మళ్లిస్తారు. ఈ రైళ్లు ఇప్పటివరకూ విజయవాడ వచ్చి అక్కడి నుంచి విశాఖ వైపు ఇంజిన్ దిశ మార్చుకునేవి. ఇకపై, ఈ రైళ్లన్నీ విజయవాడ నగర శివార్లలోని రాయనపాడు మీదుగా రాజేశ్వరిపేట, అయోధ్యనగర్, మధురానగర్, గుణదల మీదుగా రామవరప్పాడు లైన్‌లో ప్రయాణిస్తాయి. ఈ సర్వీసుల్లో ముఖ్యమైన వాటిని రామవరప్పాడు స్టేషన్‌లో ఆపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. పనులు పూర్తయ్యే వరకూ హైదరాబాద్ - విశాఖ మార్గంలో ప్రయాణించే కొన్ని రైళ్లు విజయవాడ స్టేషన్‌కు రాకుండా.. దారి మళ్లించారు.


దారి మళ్లించిన రైళ్ల వివరాలు



  • సికింద్రాబాద్ - విశాఖపట్నం (12740), గాంధీనగర్ - విశాఖపట్నం (20804), ఓఖా - పూరీ (20820), నిజాముద్దీన్ - విశాఖపట్నం (12804), చత్రపతి శివాజీ టెర్మినల్ - భువనేశ్వర్ (11019).

  • యశ్వంత్ పూర్ - టాటా (18112), హైదరాబాద్ - షాలిమార్ (18046), షిర్డినగర్ - విశాఖపట్నం (18504), విశాఖపట్నం - షిర్డిసాయినగర్ (18503).

  • షిర్డినగర్ - కాకినాడ పోర్ట్ (17205), న్యూఢిల్లీ - విశాఖపట్నం (20806), హైదరాబాద్ - విశాఖపట్నం (12728), విశాఖపట్నం - సికింద్రాబాద్ (12739).

  • విశాఖ - న్యూఢిల్లీ (20805), భువనేశ్వర్ - చత్రపతి శివాజీ టెర్మినల్ (11020), కాకినాడ పోర్ట్ - షిర్డినగర్ (17206), షాలిమార్ - హైదరాబాద్ (18045), విశాఖ - నిజాముద్దీన్ (12803).

  • టాటా - యశ్వంత్ పూర్ (18111), విశాఖ - హైదరాబాద్ (12727), విశాఖ - గాంధీనగర్ (20803), పూరీ - ఓఖా (20819), విశాఖ - లోకమాన్యతిలక్ (18519), మచిలీపట్నం - షిర్డీసాయినగర్ (17208), షిర్డీసాయినగర్ - మచిలీపట్నం (17207).

  • నర్సాపూర్ - నాగర్ సోల్ (12787), నాగర్ సోల్ - నర్సాపూర్ (12788), మచిలీపట్నం - బీదర్ (12749), లోకమాన్యతిలక్ - విశాఖపట్నం (18520), బీదర్ - మచిలీపట్నం (12759) రైళ్లను ఆగస్ట్ 2 నుంచి 10వ తేదీ మధ్య దారి మళ్లిస్తారు.


రామవరప్పాడులో ఆగే రైళ్లు ఇవే..


విజయవాడ రైల్వే స్టేషన్‌కు రాకుండా దారి మళ్లించే రైళ్లలో 8 సర్వీసులు రామవరప్పాడులో ఆపనున్నట్లు అధికారులు తెలిపారు.



  • ఆగస్ట్ 2 నుంచి 10వ తేదీ వరకూ లోకమాన్య తిలక్ (18519) రైలు రామవరప్పాడులో ఆగుతుంది.

  • మచిలీపట్నం - షిర్డీసాయినగర్ (17208) రైలును రామవరప్పాడులో ఆపుతారు.

  • నర్సాపూర్ - నాగర్ సోల్ (12787) రైలును ఆగస్ట్ 3, 5, 8, 10 తేదీల్లో రామవరప్పాడులో ఆపుతారు.

  • ఆగస్ట్ 3 నుంచి 11 వరకూ మచిలీపట్నం - బీదర్ (12749), షిర్డీనగర్ - మచిలీపట్నం (17207) రైలును ఆగస్ట్ 7న రామవరప్పాడులో ఆపుతారు.

  • ఆగస్ట్ 2, 4, 6, 8 తేదీల్లో నర్సాపూర్ రైలు, ఆగస్ట్ 2 నుంచి 10 వరకూ బీదర్ - మచిలీపట్నం (12750) రైలుకు రామవరప్పాడులో స్టాపేజీ ఉంటుంది.


Also Read: Free Sand G.O in AP : ఏపీలో ఇక ఉచిత ఇసుక - సీఎం చంద్రబాబు విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే