Free sand scheme in AP :  ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొత్తగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. గత ప్రభుతవం తీసుకు వచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొత్త విధానంాన్ని తీసుకు చ్చే వరకూ ఉచిత ఇసుక సరఫరాకు  మార్గదర్శకాలు జారీ చేశారు.  ఈ మేరకు జీవో నంబర్ 43ను చంద్రబాబునాయుడు సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఇసుకను లోడ్ చేసుకునేందుకు.. అన్ లోడ్ చేసుకునేందుకు కూలీల ఖర్చులు, రవాణా, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. 


 







కొద్ది రోజుల కిందట ఇసుక విధానంపై గనుల శాఖ మంత్రి సమక్షంలో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా గతంలోలా ఉచిత విధానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఎనిమిదో తేదీ నుంచి అమలు చేస్తామని కూడా ప్రకటించారు. దీంతో కొద్ది రోజులుగా ఇసుక కొనుగోలును వినియోగదారులు తగ్గించారు. ఎనిమిదో తేదీన అంటే సోమవారం ఉదయమే.. స్టాక్ పాయింట్ల వద్ద వాహనాలతో బారులు తీరారు. అయితే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో.. వారికి లోడింగ్ చేయలేదు.  జీవో ఇంకా విడుదల కాకపోవడంతో అధికారులు ఎదురు చూపులు చూశారు. ఇసుక కోసం పెరుగుతున్న డిమాండ్ అంశాన్ని  సీఎం చంద్రబాబు దృష్టికి  ఉన్నతాధికారులు తీసుకెళ్లారు.    వెంటనే జీవో విడుదల చేయాలని చంద్రబాబు సూచించారు.  మధ్యాహ్ం ఉచిత ఇసుక పాలసీపై ప్రభుత్వం జీవోను చంద్రబాబు తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 


2019 వరకు ఉచిత ఇసుక విధానం అందుబాటులో ఉండేది. తర్వాత వైసీపీ ప్రభుత్వం పలు రకాల విధానాలు అమలు చేసి చివరికి రాష్ట్రం మొత్తం ఇసుకను ఒకే కంపెనీకి అప్పగించాలని నిర్ణయించారు. మొదట జేపీ పవర్ వెంచర్స్ అనే కంపెనీ తర్వాత టర్న్ కీ అనే మరో కంపెనీ ఈ ఇసుక అమ్మకాలను పర్యవేక్షించారు. తర్వాత తెలంగాణకు చెందిన ప్రతిమా కంపెనీ కూడా కాంట్రాక్ట్ దక్కించుకుంది. కొత్త ప్రభుత్వం రావడంతో ఆ కంపెనీలనతో ఒప్పందాలను రద్దు చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది. స్వచ్చందంగా వెళ్లిపోవడానికి ఆ కంపెనీలు అంగీకరించినట్లుగా తెలుస్తోంది.   


పూర్తి స్థాయిలో మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేసిన తర్వాత ఇసుక విధానంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి ఉచితం అని ప్రకటించారు కాబట్టి.. హాడావుడిగా అమల్లోకి తెచ్చారని అధికార వర్గాలు చెబుతున్నాయి.