Chevireddy in AP liquor scam FIR: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్‌సీపీ అధినేత  జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును సిట్ అధికారులు నిందితుల జాబితాలో చేర్చారు.  చెవిరెడ్డిని A38 గా చేరుస్తూ... కోర్టులో మెమో దాఖలు చేసిన SIT అధికారులు.. తదుపరి చర్యలు ప్రారంభించారు. శ్రీలంక వెళ్లేందుకు ప్రయత్నించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మంగళవారం ఉదయం  బెంగళూరు  విమానాశ్రయంలో అడ్డుకున్నారు. లుకౌట్ నోటీసు ఉండటంతో అదుపులోకి తీసుకొని ఎపి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు బెంగళూరు వెళ్లాతియ. ప్రస్తుతం చెవిరెడ్డి SIT అదుపులో ఉన్నారని, ఆయన్ని బెంగళూరు నుంచి విజయవాడ తరలిస్తున్నారని తెలుస్తోంది. అలాగే చెవిరెడ్డి సన్నిహితుడు... వెంకటేష్ నాయుడు ని  A34గా  సిట్ చేర్చింది. ఇప్పటికే వెంకటేష్ నాయుడిని SIT అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

చెవిరెడ్డి మాజీ గన్ మెన్ ఆరోపణలు

ప్రభుత్వానికి AR హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖ రాశారు.  సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీ సహా పలువురికి రాసిన లేఖలో  పదేళ్ల లపాటు చెవిరెడ్డి దగ్గర గన్‍మెన్‍గా చేశానని తెలిపారు. లిక్కర్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని ఆరోపించారు.  నాకంటే ముందు విచారణకు హాజరైన గిరి కూడా తాము చెప్పినట్టే విన్నాడని అధికారులు చెప్పారనన్నారు.  విచారణకు యూనిఫాంలో వెళ్లినందుకు నన్ను తిట్టారు.. చెవిరెడ్డికి కేసుతో సంబంధం ఉందని చెప్పమన్నారని ఆరోపించారు. తప్పుడు స్టేట్‍మెంట్ ఇవ్వనని చెప్పినందుకు నాపై పది మంది సిట్ అధికారులు దాడికి దిగారనన్నారు. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు వెళ్లలేనని మదన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 

మదన్ రెడ్డి ఆరోపణల వెనుక కుట్ర ఉందన్న సిట్ 

మధ్యం కుంభకోణంపై సిట్ విచారణ లో బాగంగా పదేళ్లపాటు చెవిరెడ్డి దగ్గర గన్‍మెన్‍(PSO)గా చేసిన AR హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లిక్కర్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని, చెవిరెడ్డికి కేసుతో సంబంధం ఉందని చెప్పమన్నారని. తప్పుడు స్టేట్‍మెంట్ ఇవ్వనని చెప్పినందుకు, అతనిని  సిట్ అధికారులు బెదిరించి కొట్టారు అని మీడియా ద్వారా చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సిట్ తెలిపిదది.   పది సంవత్సరములుగా చెవిరెడ్డి భాస్కర రెడ్డి గారికి పర్సనల్ గన్ మెన్ గా చేసిన తిరుపతి జిల్లా ఏ.ఆర్.హెచ్.సి. 2189 ను విచారణ   నిమిత్తం సిట్ కార్యాలయానికి పిలిచామన్నారు.  విచారణ సమయంలో సదరు ఏ.ఆర్.హెచ్.సి.  సిట్ అధికారులకు సహకరించకుండా, విచారించుచున్న  సిట్ అదికారులనే మీ పేర్లు రాసి చనిపోతాను అని బెదిరించాడన్నారు.  చెవిరెడ్డి భాస్కర రెడ్డి తో సంబందం ఉన్న బాలాజీ కుమార్  అనే వ్యక్తిని సిట్ పోలీస్ వారు అక్రమ నిర్భంధం చేశారని హై కోర్ట్ లో హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారని  ఈ రెండు ఇన్సిడెంట్స్ చూస్తే  SIT పనిని ఆపేదానికి, సిట్ అదికారులపై ఒత్తిడి చేసి తద్వారా ఈ కేసు ధర్యాప్తును భాలహీన పరచాలనే ఉద్దేశంతో కొన్ని అదృశ్య శక్తులు కుట్రలు పన్నుతున్నట్లు స్పస్టంగా తెలుస్తుందని సిట్ అనుమానం వ్యక్తం చేసింది.