High Cholesterol in Women : కొలెస్ట్రాల్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. శరీరానికి ఎనర్జీనివ్వడంలో ఇది హెల్ప్ చేస్తుంది. అయితే ఎక్కువ స్థాయిలో పేర్కొన్నప్పుడు చెడు కొలెస్ట్రాల్​గా మారుతుంది. ఇది క్రమంగా గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుంది. జీవనశైలిలో మార్పులు, ఫుడ్స్, ఇతర ఆరోగ్య సమస్యలు అధిక కొలెస్ట్రాల్​కు కారణమవుతాయి. అందుకే ఈ మధ్యకాలంలో ఈ సమస్య ఎక్కువగా వినిపిస్తుంది. 

అధిక కొలెస్ట్రాల్ అనేది ఆడవారిలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మోనోపాజ్​లో ఉన్న చాలామంది మహిళలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే శరీరంలో విడుదలయ్యే ఈస్ట్రోజెన్ స్థాయిలు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్​ను ప్రోత్సాహిస్తాయి. అయితే మోనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ విడుదల తగ్గి చెడు కొలెస్ట్రాల్​కు దారి తీస్తుంది. ఈ సమస్యను కొన్ని మార్పులతో దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

బరువు

అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలన్నా.. రాకుండా ఉండాలన్నా బరువును అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే కొవ్వు అనేది మెటబాలీజంను ఎఫెక్ట్ చేస్తుంది. జీవక్రియ తగ్గితే బరువు పెరిగిపోతారు. అంతేకాకుండా సోమరిగా ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు బరువును అదుపులో ఉంచుకుంటే మంచిది. 

హెల్తీ డైట్ 

డైట్​లో హెల్తీ ఫుడ్స్ చేర్చుకోవాలి. బయట చేసిన, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. రోజూవారి ఆహారంలో ఫైబర్, పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్, తృణధాన్యాలు, ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ కూడా కొలెస్ట్రాల్​ను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఓట్స్​, ఫైబర్​తో నిండి ఫుడ్స్ రెగ్యులర్​గా తీసుకోవాలి. అవకాడో కూడా మంచిది. చియాసీడ్స్, వాల్​నట్స్, ఫిష్ ద్వారా శరీరానికి ఒమేగా 3 అందుతుంది. బీన్స్ కూడా ఎక్కువగా తినాలి. 

వ్యాయామం 

రెగ్యులర్​గా వ్యాయామం చేయాలి. ఇది శరీరంలో కొవ్వు అధిక మోతాదులో పేరుకుపోకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే కొవ్వు ఎక్కువగా ఉంటే అది గుండెను నెగిటివ్​గా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. 

నిద్ర 

కనీసం 6 గంటల నిద్ర లేకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. అందుకే రాత్రి నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. నాణ్యమైన నిద్ర గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. 

ఒత్తిడి 

ఒత్తిడి వల్ల కూడా శరీరంలో వివిధ హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి బరువు పెరిగేలా చేయడంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యల్ని పెంచుతాయి. వాటిలో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్, జర్నలింగ్, యోగా, డీప్ బ్రీతింగ్ వంటివి చేస్తే మంచిది. 

ఈ టిప్స్​ని రెగ్యులర్​గా ఫాలో అవుతూ వైద్య సహాయం తీసుకుంటే సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. మోనోపాజ్ తర్వాత వచ్చే హార్మోన్ల సమస్యలను గుర్తించి.. వాటిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడంతో పాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.