Sharmila challenged Subba Reddy:  షర్మిల ఫోన్ ను ట్యాపింగ్ చేసిన అంశంలో జగన్ స్పందన, సుబ్బారెడ్డి ఖండనపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తీరు అలీబాబా 40 దొంగల సామెతలా ఉందని.. దొంగ ఎక్కడైనా దొంగ అని ఒప్పుకుంటాడా  అని ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి దగ్గర ట్యాప్ అయిన నా ఆడియో ఉందని.. ఇది నిజమో కాదో.. వైవీ సుబ్బారెడ్డి తన కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. వైవీ చేతికి ఆ ఆడియో ఎలా వచ్చింది ? ఎవరైనా ఇస్తే వచ్చిందే కదా.. వైవీ నీ విచారణకు పిలవాలి.ట్యాపింగ్ లో నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. 

వైవీ సుబ్బారెడ్డి తన ఫోన్ ట్యాప్ అవుతున్న విషయం చెప్పారని.. ఆ ఆడియోను తనకు వినిపించారని షర్మిల బుధవారం చెప్పారు. అయితే సుబ్బారెడ్డి ఆ మాటల్ని ఖండించారు.  ఉదయం ప్రెస్ మీట్ లో మాట్లాడిన జగన్.. తెలంగాణలో ట్యాపింగ్ చేసి ఉంటే తనకేం సంబంధమని ప్రశ్నించారు. ఈ రియాక్షన్ పై షర్మిల స్పందించారు.  వైవీ సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చారని..  ఫోన్ ట్యాప్ చేసిన ఆడియో ఒకటి వినిపించారని..  ఇదే రుజువు..ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు.  మా ఇంట్లో కూర్చుని నాకే వినిపించారు కాబట్టి చెప్తున్నానన్నారు.  నేనే నా చెవులారా విన్నానని..  బైబిల్ మీద ,నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నానని..  నా ఫోన్ ట్యాపింగ్ వాయిస్ నేను విన్నా...ఇదే నిజం అని స్పష్టం చేశారు. 

ట్యాపింగ్ మాకేం అవసరం అని ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని..  నేను ఆర్థికంగా,రాజకీయంగా ఎదగకూడదు అని చేశారని ఆరోపించారు.  నా పై నిఘా పెట్టారు.. నేను ఎవరిని మీట్ అవుతున్నాం అని గ్రహించారు..  నాకు సపోర్ట్ ఇవ్వకుండా పెద్ద పెద్ద నాయకులను ఆపి వేశారన్నారు.  ఇదంతా ఫోన్ ట్యాప్ చేసి జరిపిన కుట్ర నేనని స్పష్టం చేశారు.  సుబ్బారెడ్డి చేతిలో ఎందుకు ఆడియో ఉంది ?.. సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలన్నారు.  ఆనాడు సుబ్బారెడ్డి తో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అలాంటి పరిస్థితిలో నాకు ఆడియో వినిపించారన్నారు.  తర్వాత ఆస్తుల విషయంలో కుట్రలు పన్ని సుబ్బారెడ్డితో అబద్ధాలు జగన్ చెప్పించాడు..  అప్పటి నుంచి నాకు సుబ్బారెడ్డి కి మాటలు లేవన్నారు.

కేసీఆర్, జగన్ చేసినవి ఆనాడు నీచ రాజకీయాలు.. అందుకే నా ఫోన్ ట్యాప్ చేశారు. మా నాన్న లాంటి సుబ్బారెడ్డి నాకే స్వయంగా వినిపిస్తే నేను ఎంత బాధపడి ఉంటానో అర్థం చేసుకోవాలన్నారు.  రెండు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినయి కాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చిందని..  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు విచారణ జరుగుతుందన్నారు.  ఒకవేళ అక్కడ KCR,ఇక్కడ జగన్ వచ్చి ఉంటే ఈ విషయం వెలుగులోకి వచ్చి ఉండేది కాదన్నారు జగన్ తీరు అలీబాబా 40 దొంగల తీరు లెక్క ఉందని..  దొంగలు ఎక్కడైనా దొంగతనం చేశాం అని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు.  ఇక్కడ అలీబాబా దొంగ...అక్కడ ఉన్న 40 మంది దొంగలే..  ఫోన్ ట్యాపింగ్ పై ఇన్వెస్టిగేషన్ జరగాలన్నారు.   ఆ ఆడియో ఆయనకు ఎలా వచ్చింది సుబ్బారెడ్డి నీ కూడా విచారణ కు పిలవాలన్నారు.