Jagga Reddy donates Rs 10 lakh to cancer patient: రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా క్యాన్సర్ పేషెంట్ కి 10 లక్షల ఆర్ధిక సాయం చేశారు కాంగ్రె్స నేత జగ్గారెడ్డి. 13 వేల చిరుద్యోగి కి... లక్షల ఖర్చు తో కూడిన క్యాన్సర్ తో పోరాటం ఎలా సాధ్యమని భావించిన ఆయన.. నిరుపేద క్యాన్సర్ పేషంట్ హరి కృష్ణ ప్రసాద్ పూర్తి ట్రీట్మెంట్ కు ముందుకు వచ్చారు.
నియోజకవర్గానికి చెందిన వ్యక్తి క్యాన్సర్ బారిన పడటంతో సాయం
సంగారెడ్డి నియోజకవర్గం తాళ్లపల్లి గ్రామానికి చెందిన హరి కృష్ణ ప్రసాద్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. గురుకుల పాఠశాలలో 13 వేల రూపాయలు చిరుధ్యోగి గా పనిచేస్తున్నారు హరికృష్ణ ప్రసాద్. హరి కృష్ణ ప్రసాద్ కు భార్య శైలజ, ఎల్ కే జి, ఒకటో తరగతి చదువుతున్న పాప, బాబు ఉన్నారు. మూడు నెలల క్రితం హరి కృష్ణ ప్రసాద్ కు క్యాన్సర్ ఉందని తేలింది. ఇప్పటికే వైద్యం కోసం లక్షల రూపాయల ఖర్చు చేసిన కుటుంబం .. ఇకపై వైద్యానికి డబ్బులు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో లో పడ్డారు.
పది లక్షల రూపాయల క్యాష్ అందించిన జగ్గారెడ్డి
అనుచరుల ద్వారా హరి కృష్ణ ప్రసాద్ పరిస్థితి నీ తెలుసుకున్న జగ్గారెడ్డి.. క్యాన్సర్ చికిత్స కు పూర్తి ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చారు. రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా క్యాన్సర్ పేషంట్ హరి కృష్ణ ప్రసాద్ కు పది లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. హరి కృష్ణ ప్రసాద్ కు, కుటుంబ సభ్యులకు తాను ఉన్నానంటూ ధైర్యం చెప్పారు. ఇప్పటి వరకు చికిత్స కోసం అయిన ఖర్చులు సైతం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. జగ్గారెడ్డి సహాయం పట్ల హరికృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ తరపున మరింత సాయం
సంగారెడ్డిలో జగ్గారెడ్డి సాయం చేసే లీడర్ గా గుర్తింపు పొందారు. ఆయన సాదాసీదాగా ఉంటారు. సాధారణ జీవనం గడుపుతారు. అయితే ప్రజలకు కష్టం వస్తే మాత్రం పెద్ద ఎత్తున సాయం చేస్తారు. సంగారెడ్డి నుంచి గతంలో పలుమార్లు గెలిచిన ఆయన ఇటీవల ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయ్యారు.
చాలా మంది రాజకీయ నేతలు .. కష్టాల్లో ఉన్నామని తమ వద్దకు వస్తే మన ప్రభుత్వం రాగానే చేస్తామని చెబుతారు. అధికారంలో ఉన్న వారు అయితే.. సాయం చేస్దామని చెప్పి అప్లికేషన్లు తీసుకుని పట్టించుకోరు. అదే సమయంలో వ్యక్తిగతంగా సాయం చేసే వారు చాలా పరిమితంగా ఉంటారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న ధనవంతులైన లీడర్లు ఎప్పుడూ వ్యక్తిగత సాయం చేసినట్లుగా కనిపించరు. కానీ జగ్గారెడ్డి మాత్రం భిన్నం.