Farmer ABV  :   "దుర్మార్గుడైన రాజు కింద పని చేయడం కంటే అడవికి వెళ్లి వ్యవసాయం చేసుకోవడం మంచిదని" ఓ కవి చెప్పారని రెండు రోజుల కిందట సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో వ్యాఖ్యానించారు. మూడేళ్ల పాటు ఏ పోస్టింగ్ లేకుండా రెండేళ్లకుపైగా సస్పెన్షన్‌లో ఉంచి .. సుప్రీంకోర్టు ఆదేశాలతో చివరికి పోస్టింగ్ దక్కించుకున్న పదిహేను రోజుల్లోనే మళ్లీ సస్పెన్షన్ వేటు వేయడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన రొటీన్‌గా అలా చెప్పారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన సీరియస్‌గానే చెప్పారు. ఎందుకంటే ఆయన ఇప్పటికే వ్యవసాయం ప్రారంభించేశారు.


వైసీపీ ప్రభుత్వంలో ఎలుకల మద్యం తాగుతాయ్, ఉడుతల కరెంట్ వైర్లు తెంపేస్తాయ్- మాజీ మంత్రి పరిటాల సునీత


ఐపీఎస్‌గా ముఫ్పై ఏళ్ల  అనుభవం ఉన్న ఏబీకి డీజీ హోదా ఉంది. అయినప్పటికీ చెప్పినట్లుగా వ్యవసాయంలోకి దిగిపోయారు. దుక్కి దున్నేశారు. ఇక విత్తనాలు వేస్తారేమో తెలియదు. ఇప్పటికే పామాయిల్ తోట ఉన్న పొలంలో అంతర పంటగా మరో పంట వేయడానికి భూమిని సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పొలంలో  రైతుగా మారిపోయిన ఏబీ వెంకటేశ్వరరావు ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు!


ఏబీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు.  ఇంటలిజెన్స్ చీఫ్‌గా తాను రాష్ట్రాన్ని తగుల బెట్టాలనుకున్న ప్రతీ సారి ఆపానని ప్రకటించారు. అందుకే తనపై కొంత మంది వ్యక్తులు టార్గెట్ చేశారని ఆరోపించారు. అసలు అవినీతే లేని కేసులో సాక్షులను ప్రభావితం చేశారనే అభియోగంపై సస్పెండ్ చే్యడం  ఏమిటని అంటున్నారు. ఓ వైపు న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. మరో వైపు వ్యవసాయం కూడా ప్రారంభించారు.


దేవాదాయ శాఖ‌లో సామూహిక‌ బ‌దిలీలు- అర్థరాత్రి జీవో విడుదల


ఏబీ వెంకటేశ్వరరావు సర్వీసు మరో రెండేళ్ల పాటు ఉంటుంది. అంటే ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మాత్రమే సర్వీసు ఉంటుంది. మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి ఆయన రిటైర్ అవుతారు. అయితే.. తనపై తప్పుడు ఆరోపణలు చేసి.. తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని చెబుతున్నారు.  అయితే మరో రెండేళ్ల పాటు తనకు పోస్టింగ్ వచ్చే అవకాశం లేదని ఆయన ఓ నిర్ణయానికి వచ్చేసినట్లుగా ఉంది.  అందుకే ప్రత్యామ్నాయ ఉపాధి వ్యవాయం ప్రారంభించేశారు.