Security Lapse In Modi  Road Show :  విజయవాడలో ప్రధాని మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ అయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ జయవాడలో ప్రధాని మోదీ రోడ్‍షో నిర్ర్వహించారు.నరేంద్ర మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు, ర్యాలీ ప్రారంభం, చివరలో డ్రోన్‍లు ఎగురవేయడంపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. ప్రధాని రోడ్‍షో ప్రాంతం ముందుగానే నోప్లై జోన్‍గా ప్రకటించినా డ్రోన్లు ఎలా ఎగరగలిగాయాని  కేంద్ర హోంశాఖ డీజీపీని ప్రశ్నించింది. ఈ ఘటన వెంటనే విచారణ జరిపి  బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర హోం శాఖ లేఖ పంపించింది. ఇప్పటి వరకూ ఇలా ప్రధాని రోడ్ షోలో అనధికారిక డ్రోన్లు ఎగిరిన విషయం బయటకు రాలేదు.


ప్రధాని రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ సీరియస్                                    


ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లను ఎస్‌పీజీ చూసుకుంటుంది. ఏ మాత్రం చిన్న తేడా కనిపించినా సీరియస్ గా స్పందిస్తుంది. ప్రధాని రోడ్ షో రోజున మొదట ఓ డ్రోన్ ఎగరగడం గమనించి కిందకి దించి వేయించారు. ఈ ఘటన తర్వాత మరో డ్రోన్ ఎగరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే రోడ్ షో ముగిసే సమయంలో మరో డ్రోన్ ఎగిరింది. దీనిపై ఎస్పీజీ గ్రూప్ అప్పుడే కేంద్ర హోంశాఖకు నివేదిక  పంపింది. తీవ్ర భద్రతా ఉల్లంఘనగా భావించింది. బందోబస్తు నిర్వహించిన పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా ఉండటమో.. లేకపోతే వారి అనుమతితో ఎగురవేయడమో  చేసి ఉంటారని భావిస్తున్నారు. 


మోదీ రోడ్ షో సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహించిన వారిపై విచారణ                                            


కేంద్ర హోంశాఖ స్వయంగా ఆదేశించడంతో ఇప్పుడు  డీజీపీ అసలు డ్రోన్లు ఎగురవేసిన వాళ్లు ఎవరు.. ఎందుకు ఎగురవేశారు.. పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు.. ఒక వేళ పోలీసులే ఎగురవేస్తే.. నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదు వంటి అంశాలపై దర్యాప్తు చేసి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మోదీ  భద్రతా ఏర్పాట్లను సీనియర్ ఐపీఎస్ అధికారులు చూస్తారు. వారిలో నిర్లక్ష్యం ఎవరితో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 


పలువురు ఐపీఎస్‌లపై చర్యలు తీసుకునే చాన్స్            


మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం ఇదే  మొదటి సారి కాదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే  ..మోదీ చిలుకలూరిపేట బహిరంగసభకు  హాజరయ్యారు. ఆ సభలో మొత్తం గందరగోళం ఏర్పడింది. పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఫలితంగాఆ సభ రక్షణ బాధ్యతల్లో ఉన్న పలువురు ఎస్పీలపై ఈసీ వేటు వేసింది. ఈ సారి మరికొంత మంది ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.