Trains Cancelled Vijayawada Division: విజయవాడ డివిజన్‌లో పలు రైలు సర్వీసులను దక్షిణ మద్య రైల్వే రద్దు చేసింది. కొన్ని సర్వీసులను పాక్షికంగా నిలిపివేయగా, కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. భద్రతా పనుల కారణంగా విజయవాడ డివిజన్ లో పలు రైలు సర్వీసులు రద్దు చేయగా, మరికొన్ని దారి మళ్లించినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఒక్క సర్వీసు మాత్రం జులై 16 నుంచి 22వ తేదీ వరకు రద్దు చేశారు. ట్రైన్ నెంబర్ 07978 విజయవాడ నుంచి బిట్రగుండ వెళ్తుంది. ఈ రైలును జులై 22 వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 12 రైళ్లను రద్దు చేయగా, మరో రెండు రైళ్లను పాక్షికంగా దారి మళ్లించారు. 4 రైళ్లను పూర్తిగా దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.


ఈ నెల 17 నుంచి 23 వరకు రద్దయిన రైలు సర్వీసుల వివరాలు ఇలా ఉన్నాయి. 07977 రైలు సర్వీసు బిట్రగుంట నుంచి విజయవాడకు వెళ్తుంది. ఈ రైలుతో పాటు 17237 బిట్రగుంట నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కు వెళ్లనున్న రైలు సర్వీసును సైతం 17 నుంచి 23వ తేదీ వరకు రద్దు చేశారు. రాజమండ్రి- విశాఖ ప్యాసింజర్‌ రద్దు అయింది. ట్రైన్ నెంబర్ 17238 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి బిట్రగుంట సర్వీసుతో పాటు విశాఖపట్నం నుంచి రాజమండ్రి ప్యాసింజర్ రైలు 07467 రద్దు చేశారు. 


ట్రైన్ నెంబర్ 22701 జులై 23 వరకు విశాఖ- విజయవాడ మార్గంలో నడిచే ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ నుంచి విశాఖకు వెళ్లే 22702 సర్వీసుతో పాటు విశాఖపట్నం-   కాకినాడ పోర్ట్ 17268, విజయవాడ నుంచి గూడురు వెళ్లాల్సిన 07500, గూడురు నుంచి విజయవాడ వెళ్లాల్సిన 07458 రైలు 18 నుంచి 23వ తేదీ వరకు రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పేర్కొన్నారు.






ఈ నెల 17 నుంచి 23 వరకు నరసాపూర్ నుంచి గుంటూరు మీదుగా విజయవాడ వెళ్లే 17282 రైలు సర్వీసు రద్దు అయింది. అదే సమయంలో గుంటూరు నుంచి విజయవాడ మీదుగా నరసాపూర్ వెళ్లే 17281 ట్రైన్ పాక్షికంగా రద్దు చేశారు. 


జులై 18, 21, 22 తేదీలలో ధన్‌బాద్‌ నుంచి అలెప్పీ వెళ్లాల్సిన బొకారో ఎక్స్‌ప్రెస్‌ దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు.  టీటీడీ, ఈఈ జంక్షన్లలో నిలపడం లేదు. మరోవైపు నిడదవోలు, బీమవరం జంక్షన్, గుడివాడ, విజయవాడ జంక్షన్ల మీదుగా కింది సర్వీసులు దారి మళ్లించారు. ట్రైన్ నెంబర్ 12835 హాతియా నుంచి ఎస్ఎంవీ బెంగళూరు వెళ్లాల్సిన రైలు జులై 18న బయలుదేరనుంది. ఈ నెల 21న ట్రైన్ నెంబర్ 12889 సర్వీస్ టాటానగర్‌ - ఎస్‌ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ తో పాటు జులై 22న ఎస్ఎంవీ బెంగళూరు నుంచి టాటానగర్ వెళ్లనున్న ఎక్స్ ప్రెస్ రైలును దారి మళ్లిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.