Sajjala Comments : వైఎస్ఆర్‌సీపీ ఘన విజయం సాధించి నాలుగేళ్లు అయిన సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు తాము ఇచ్చిన హామీల్లో 98 శాతం పూర్తి చేశామన్నారు. అభివృద్ధి అంటే నాలుగు ఫ్యాక్టరీలు పెట్టడం కాదని స్పష్టం చేశారు. :సీఎం జగన్ పాలనను చూసి విపక్షాలు కడుపుమంటతో రగిలిపోతున్నాయని విమర్శించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏపీ పాలనను మెచ్చుకుంటున్నాయని ఆయన గుర్తు చేశారు.
నాలుగేళ్లలో మంచి పాలన అందించిన సీఎం జగన్
మే 30 న జగన్ ప్రమాణం చేశారన్నారు. మేనిఫెస్టోను 98.5 శాతం అమలు చేశారన్నారు. ఈ నాలుగు ఏళ్లలో ఈ రాష్ట్రంలో జగన్ మంచి పాలనను అందచేశారన్నారు. ఒక పక్క పాలన వికేంద్రకరణకు సైతం కృషి చేశారన్నారు. అవినీతికి వ్యతరేకంగా పేదలకు అనుకూలంగా పాలన సాగుతోందన్నారు. 4 ఏళ్ల లో 4 పోర్ట్‌లను అభివృద్ధి చేశారన్నారు. డెవలప్ మెంట్ అంటే చిన్న ఫ్యాక్టరీ లు 4, 5 పెట్టడం గొప్ప కాదని సజ్జల తెలిపారు. పాలన వికేంద్రీకరణ ద్వారా 3 రాజధానులతో కోర్టు వివాదాలు దాటితే ఆదర్శమైన పాలన ప్రారంభం అవుతుందన్నారు. 2019 కన్నా మించిన విజయం ప్రజలు రానున్న రోజుల్లో అందించాలని కోరారు.
వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన ఆనం- నియోజకవర్గంపై కొనసాగుతోంది వివాదం
అవినాష్ రెడ్డిపై తప్పుడు ప్రచారం
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారంనాడు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. తల్లి ఆరోగ్యం బాగా లేకపోతే నాటకాలు అంటూ ప్రచారం చేస్తారా అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే ఆరు దఫాలు సీబీఐ విచారణకు హాజరయ్యారన్నారు.
అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు - ముందస్తు బెయిల్‌పై ఏం చెప్పిందంటే ?
అవినాష్ రెడ్డి టైం అడిగారు.. ఇస్తే ఏమవుతుంది ?
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి సహకరిస్తున్నారన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో అవవసర కథనాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఓ వర్గం మీడియాపై మండిపడ్డారు. అవినాష్ రెడ్డి విషయంలో కూడా రోత రాతలు రాస్తున్నారని ఆయన విమర్శించారు. అవినాష్ రెడ్డి అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. అవినాష్ రెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సీబీఐ, రాష్ట్ర పోలీస్‌లను అవినాష్ అరెస్ట్ కోసం సాయం చేయమని అడిగారా? అది డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ మధ్య జరుగుతుందనేది మనకు ఎలా తెలుస్తుంది? అవినాష్ టైం అడిగాడు ఇస్తే ఏమవుతుంది? టైం తీసుకొని అప్పటికి రాకపోతే అరెస్ట్ చేస్తారు. హైదరాబాద్, బెంగళూర్‌కు ఎందుకు అవినాష్ తల్లిని తీసుకు వెళ్ళలేదు అంటారు. కర్నూల్ ఎందుకు తీసుకువచ్చారని అడుగుతారు. గవర్నమెంట్‌కి అవినాష్ వ్యవహారానికి సంబంధం లేదు’’ అని తెలిపారు.