Jagan Birthday Special :   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 50వ పుట్టిన రోజును ఈ నెల 21వ తేదీన జరపుకోనున్నారు. ఈ పుట్టిన రోజులను ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్‌సీపీ నిర్ణయించించింది. ఇందు కోసం  ప్రత్యేక వెబ్‌సైట్‌ను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో కోట్లాది మంది అభిమానులు పాల్గొంటారని, సంక్షేమ పథకాలతో లబ్దిపొందిన వారంతా పాల్గొంటారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 





గతంలో పార్టీ కార్యకర్తలు 38వేల యూనిట్ల రక్తదానం చేశారని, ఈసారి వైఎ‍స్సార్‌సీపీ బ్లడ్‌ డొనేషన్‌. కామ్‌ ( http://ysrcpblooddonation.com )  పేరిట వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్లడ్‌ డొనేషన్‌కు పేర్లు నమోదు చేసుకుంటే అవసరమైనప్పుడు రక్తదానం చేసే అవకాశం ఉందన్నారు. ఈనెల 19న రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని, 20న మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు సజ్జల తెలిపారు. 21వ తేదీన పేదలకు అన్నదానం వంటి సేవాకార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


సీఎం  జగన్ యాభై పుట్టిన రోజు వేడుకలను ఇప్పటికే ఘనంగా నిర్వహిస్తున్నారు.  జగనన్న స్వర్ణోత్సవ సంబరాల పేరిట కొద్ది రోజులుగా పండగ చేస్తున్నారు.  ఇందు కోసం రెండు కోట్ల రూపాయలు  .. సాంస్కృతిక శాఖకు కేటాయించారు. దాంతో  పలు చోట్ల వేడుకలు నిర్వహిస్తున్నారు.  ఇందులో మంత్రి రోజా డాన్సులు అదనపు ఆకర్షణ అనుకోవాలి.   జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతున్నాయి.   ఇప్పటికే తిరుపతి, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ల్లో  పూర్తయ్యాయి. ఇప్పుడు విశాఖలో జరుగుతున్నాయి. మంత్రి రోజా  ఆధ్వర్యంలో ఇవి సాగుతున్నాయి. కార్యక్రమం జరుగుతున్న ప్రతీ చోటా ఆమె డాన్సులు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.


వైసీపీ పార్టీ పరంగా జగన్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించబోతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా జగన్ పుట్టిన రోజు వేడుకలకను ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.   వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 1972, డిసెంబర్ 21న జన్మించారు.  2009 మే నెలలో తొలిసారిగా కడప లోకసభ సభ్యునిగా విజయం సాధించారు.  తన తండ్రి  వై.ఎస్.రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత,  కాంగ్రెసుతో విభేదాల కారణంగా పార్టీ కి రాజీనామా చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. 2014 ఎన్నికలలో పార్టీ ఓటమి పాలైనా, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. 


జగన్ సీఎంగా ఉడంటం ప్రజల దురదృష్టం - వారాహీని అపలేరని ఏపీ బీజేపీ నేత వార్నింగ్ !