Roja On chiru :  సినిమా వేదికలు మీద రాజకీయాలు మాట్లాడకూడదని మెగాస్టార్ చిరంజీవికి రోజా సలహా ఇచ్చారు.  చిరంజీవి సలహా ఇవ్వాలి అనుకుంటే ముందు అయన తమ్ముడుకు ఇవ్వాలన్నారు.  కేంద్ర మంత్రి గా పనిచేసిన మీరు ఏపి ప్రత్యేక హోదా కోసం ఏమీ చేశారని రోజా ప్రశ్నించారు.  పార్టీ విలీనం చేసినప్పుడు చిరంజీవి లబ్ధి పొందారు, రాష్ట్రానికి చేసింది ఏమి లేదని ఆరోపించారు.  మీరు చెప్తే వినే స్థాయిలో లేమని  ముందు ఏదైనా సలహా ఇవ్వలి అనుకుంటే ముందు మీ తమ్ముడు కు ఇవ్వాలని  చిరంజీవికి సూచించారు.  


సినిమా వాళ్ల రెమ్యూనరేషన్ల గురించి వైసీపీ నేతలు మాట్లాడలేదన్న రోజా 


బుధవారం తిరుపతి జిల్లా, వడమాలపేటలోని "నా మట్టి నా దేశం" కార్యక్రమంలో ఏపి పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.  చిరంజీవి ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తనకు తెలియదు కానీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గానీ, మంత్రులు గానీ, ఎవరైనా ఇప్పటి వరకు సినిమా వాళ్ళ రెమ్యూనివేషన్ గురించి మాట్లాడలేదన్నారు.  ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ తను సినిమా చేస్తే రెండు కోట్లు ఇస్తారు, ఐదు కోట్లు ఇస్తారు, 30 కోట్లు ఇస్తారని తానే చెప్పుకుంటారని, ఎవరూ  ఇంత వరకూ అలా చెప్పుకోలేదన్నారు.. సినిమాలు చేసే సమయంలో సినిమాలకు పరిమితం కావాలని, రాజకీయం చేసే సమయంలో కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడాలని ఆమె సూచించారు  


సినిమా వేదికలపై రాజకీయాలు ముడిపెట్టి మాట్లాడటం సరి కాదన్న రోజా  


సినిమా వేదికల మీద రాజకీయాలను ముడిపెట్టి ప్రభుత్వంపై  దుమ్మెత్తి పోసేది చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కాదా అని ఆమె ప్రశ్నించారు. చిరంజీవి ఏదైనా అడ్వైజ్ ఇవ్వాలంటే ముందుగా పవన్ కళ్యాణ్ కి ఇస్తే బాగుంటుందని ఆమె సలహా ఇచ్చారు.  ఎంతో మంది సినిమా హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారని వారు ఎప్పుడూ కూడా వారి సక్సెస్ మీట్ లో గానీ, ఆడియో ఫంక్షన్స్ లో గానీ, రాజకీయాలపై గానీ ప్రభుత్వంపై దుమ్ము ఎత్తిపోసే కార్యక్రమాలు ఎప్పుడూ గానీ చేయలేదన్నారు.. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు.  


అంబటి మాత్రమే మాట్లాడారన్న రోజా  


ఇటీవల రిలీజ్ ఐనా బ్రో సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు లాంటి క్యారెక్టర్ ని పెట్టి అవమానించారని, దీనిపై అంబటి రాంబాబు స్పందించారే గానీ ఈ విషయంపై ఇంకెవరూ మాట్లాడలేదని ఆమె స్పష్టం చేశారు.. రాష్ట్ర సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, ప్రత్యేక హోదా గురించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలని చిరంజీవి మాట్లాడటం సరైన విధానం కాదన్ని చెప్పారు.. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని విడగొట్టారని ఆ సమయంలో చిరంజీవి దగ్గరుండి రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడు లేదని మంత్రి రోజా అడిగారు. చిరంజీవి చెబితే అది విని చేయాల్సిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేరన్నారు. పెద్దరికంగా మీ తమ్ముడికి బుద్ధి చెప్పి రాజకీయాలని సినిమాలని ముడిపెట్టి నాంది పలకద్దు అని చెప్పాలని సూచించారు.