Roja On Chandrababu :   కందుకూరు తొక్కిసలాట ఘటనలో కోర్టులు జోక్యం చేసుకుని సుమోటోగా కేసు పెట్టాలని ఏపీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ లపై ఘాటు విమర్శలు చేశారు.  చంద్రబాబు మీటింగ్ లో‌ నిన్న జరిగిన ఘటన చూస్తుంటే చాలా భాద వేస్తుందని అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి‌ కోసం, తన షోని సక్సెస్ చేసుకునేందుకు ప్రజల ప్రాణలతో ఆడుకున్నాడని ఆరోపించారు.  ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబుని ఏం అన్నాలో ప్రజలే చెప్పాలని కోరారు. మీటింగ్ అంటే గ్రౌండ్స్ లో‌ గానీ, సేఫ్ ప్లేస్ లో పెట్టుకోవాలన్నారు.  మీటింగ్ జరిగే సమయంలో భధ్రత ఏర్లాట్లైనా కనీసం ఉండేలా చూడాలన్నారు. 


ఎవరికైనా ఏమైనా జరిగే వారిని‌ రక్షించే విధంగా చర్యలు తీసుకొనేలా మీటింగ్ నిర్వహణ ఉండాలని....కానీ చంద్రబాబు భాధ్యత‌ లేకుండా నిర్లక్ష్యంగా రాత్రుల్లో సభలు పెట్టి  ఛానల్ లో చూపించుకుంటున్నాడని విమర్శించారు.  చంద్రబాబు సభలతో ఆడవాళ్లు చనిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.  కోర్టులను చేతులు ఎత్తి నమస్కరించి వేడుకుంటున్నానని...ఎనిమిది మంది‌ ప్రాణాలను తీసిన చంద్రబాబు నాయుడిని సుమోటాగా కేసు స్వీకరించాలని విజ్ఞప్తి చేసారు. ఏ1 ముద్దాయిగా పెట్టి హత్య‌ కేసు పెట్టాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు అధికారంలో‌ ఉన్న సమయంలో  నిర్వహించిన పుష్కరాలలో పబ్లిసిటీ పిచ్చితో విఐపి ఘాట్ కి వెళ్ళకుండా ప్రజలు ఉన్న చోటలో గేట్లు తెరిచి 29 మంది‌ ప్రాణాలు తీసాడని....ఆ సీసీ పుటేజ్ దొరక్కుండా చేశారన్నారు. 


భగవంతుడు చంద్రబాబుకి శిక్ష వేస్తాడని రోజా జోస్యం చెప్పారు.  చంద్రబాబు వైఖరిని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారని చెప్పారు. జగన్ 3600 కిలో‌మీటర్ల మేర పాదయాత్ర చేసి ఎన్నో‌ పబ్లిక్ మీటింగ్స్ పెట్టారని... కట్టుదిట్టమైన భధ్రత మధ్య జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు పెట్టారో గమనించామని కొనియాడారు. గ్రౌండ్స్ లో పెట్టుకోవడానికి జనం లేరని పబ్లిసిటీ పిచ్చి కోసం ఎనిమిది మంది ప్రాణాలు తీయడం రాజకీయ హత్యే అని స్పష్టం చేశారు. ఎక్కడో ఎవరో సంబంధం లేకుండా చనిపోతే కోటి రూపాయలు ఇవ్వాలని టిడిపి వాళ్ళు జగన్ ను డిమాండ్ చేశారని...చంద్రబాబు షో సక్సెస్ చేసుకునేందుకు చేసిన తప్పుకి మృతి చేందిన కుటుంబాలకు రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని...క్షతగాత్రులకు కోటి రూపాయలయ ఇవ్వాలని డిమాండ్ చేసారు. లోకేష్ ఒక ఐరన్ లెగ్..లోకేష్ ఎక్కడికి వస్తే అక్కడ ఏదోక్కటి జరుగుతుందన్నారు. 


నారా లోకేష్ ఏదో అనుకుని యువగళం అని పోస్టర్ రిలీజ్ చేసారో... నిమిషాల్లో ఎనిమిది మంది‌ మృతి చేందారన్నారు. ఇక లోకేష్ పాదయాత్ర చేస్తే రాష్ట్రం ఏం అవుతుందో అన్న భయం ప్రజల్లోనూ, మాలోనూ ఉందన్నారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు మంచి చేసి ఉండే మాకు ఓటు వేయండి అని ధైర్యంగా అడుగవచ్చన్నారు.  చంద్రబాబు ప్రజలకు ఏం చేయలేదని ఆయనే ఒప్పుకొంటున్నారని తెలిపారు. జగన్ని తిట్టడానికి బాదుడే బాదుడు,ఇదేం‌ కర్మరా బాబు అంటూ మీటింగ్లు పెడితే....కొడుకుని ఎమ్మెల్యేగా ఓడించి, చంద్రబాబుని సీఎం కాకుండా చేసి హైదరాబాదుకు తరిమేసినా మీటింగులు పెట్టి ఇదేం కర్మరా బాబు అంటూ ప్రజలు తలలు మొత్తుకుంటున్నారని ఎద్దేవా చేసారు.  అధికారంలో‌ ఉండి ఏం చేయని చంద్రబాబు, ఏం లేకున్నా అన్ని చేస్తున్న జగన్ని తిట్టేందుకు ఊర్లకు వస్తున్న టిడిపి వాళ్ళకు బుద్ది చెప్పండని ప్రజలను కోరారు.