Biryani Offer In Jangareddygudem Restaurant: బిర్యానీ అంటే ఆ క్రేజే వేరు. చికెన్ ధమ్ బిర్యానీ అంటేనే జనం లొట్టలేసుకుని తింటుంటారు. కొన్ని రెస్టారెంట్లు పబ్లిసిటీ కోసమో లేక తమ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసమో క్రేజీ ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. తాజాగా, ఏలూరు (Eluru) జిల్లా జంగారెడ్డిగూడెంలో (Jangareddygudem) ఓ రెస్టారెండ్ రూ.3కే బిర్యానీ అంటూ ప్రకటించింది. దీంతో జనం ఒక్కసారిగా ఆ బిర్యానీ తినేందుకు ఎగబడ్డారు. రెస్టారెంట్‌కు క్యూ కట్టారు. నగరంలో ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా రూ.3కే బిర్యానీ అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. గత వారం రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పబ్లిసిటీ చేశారు. దీంతో భారీ ఎత్తున బిర్యానీ ప్రియులు రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు.
బిగ్ ట్విస్ట్
అయితే, రెస్టారెంట్ యాజమాన్యం అక్కడికి వెళ్లిన బిర్యానీ ప్రియులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఆఫర్ కేవలం 3 గంటలేనని స్పష్టం చేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ మాత్రమే రూ.3కు బిర్యానీ ఇస్తామని చెప్పడంతో ఈ క్రేజీ ఆఫర్ వినియోగించుకోలేని ప్రజలు నిరాశకు లోనయ్యారు. అయితే, టైంకు వెళ్లిన వారికి మాత్రం చెప్పినట్లుగా బిర్యానీ అందించారు. క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెస్టారెంట్ యాజమాన్యమే చర్యలు చేపట్టింది. దాదాపు 4 వేల నుంచి 5 వేల మంది ఈ ఆఫర్ వినియోగించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిజంగా క్రేజీ ఆఫర్ కదూ.
Also Read: KTR News: ఆ మంత్రిని వదిలిపెట్టను, సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా - కేటీఆర్