Reliance is set to set up a huge beverages unit in Kurnool:  కర్నూలు వద్ద భారీ పరిశ్రమ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  రూ.1,622 కోట్లతో శీతలపానీయాల పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. పరిశ్రమ ఏర్పాటుతో 1200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎస్ఐపీబీ సమావేశంలో ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.  ఓర్వకల్లు ఏపీఐఐసీ ల్యాండ్ లో పరిశ్రమ ఏర్పాటు చేస్తారు.  

ఎకరాకు రూ.30 లక్షల చొప్పున ప్లాంటుకు 80 ఎకరాలు కేటాయిస్తారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం ప్రోత్సాహకాలు అందిస్తారు. 2026 డిసెంబర్ లోగా ఉత్పత్తి ప్రారంభించాలని రిలయన్స్ సంస్థకు గడువు విధించారు.  తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసీ ఛైర్మన్, ఎండీకి ఆదేశాలు జారీ అయ్యాయి.                           ఈ ప్రాజెక్ట్ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. ఈ యూనిట్‌లో ప్యాకేజ్డ్ కార్బోనేటెడ్ శీతల పానీయాలు (సాఫ్ట్ డ్రింక్స్) , ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటివి తయారు చేస్తారు.  ఈ యూనిట్‌లో బాట్లింగ్ లైన్, వేర్‌హౌసింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ సౌకర్యం,  అడ్మినిస్ట్రేటివ్ భవనాలు ఉంటాయి.

రిలయన్స్ 2022లో రూ. 22 కోట్లకు కాంపా కోలా బ్రాండ్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ బ్రాండ్ 1970, 1980లలో భారతదేశంలో ప్రముఖ శీతల పానీయ బ్రాండ్‌గా ఉండేది.  దీనిని "న్యూ ఇండియా" కోసం సమకాలీన రూపంలో తిరిగి ప్రవేశపెట్టాలని రిలయన్స్ నిర్ణయించుకుదంి.  కర్నూలు ప్లాంట్ రిలయన్స్   ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) విభాగంలో భాగంగా  ఏర్పాటు చేస్తున్నారు.  ఇది దేశీయ బ్రాండ్‌లను ప్రోత్సహించడం,  భారతీయ వినియోగదారులకు సరసమైన ధరలలో అధిక నాణ్యత ఉత్పత్తులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.                                            రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన  రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ఆధ్వర్యంలో శీతల పానీయాల (సాఫ్ట్ డ్రింక్స్) , ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఉత్పత్తులను తయారు చేస్తుంది.  కాంపా కోలా కాంపా లెమన్ , కాంపా ఆరెంజ్ , పవర్ అప్ ,  సుర్ వాటర్ వంటి ఉత్పత్తులు  ఉన్నాయి.  ఈ బ్రాండ్ "The Taste of India" నినాదంతో స్థానిక వినియోగదారులను ఆకర్షించేలా సిద్ధం చేశారు.  ఈ ఉత్పత్తులు కోకా-కోలా, పెప్సీ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లతో పోటీపడేందుకు సిద్దం చేస్తున్నారు. ఈ ప్లాంట్ కర్నూలు జిల్లాలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది మరియు స్థానిక వ్యాపారులకు, సరఫరాదారులకు అవకాశాలను కల్పిస్తుంది.   

రిలయన్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఇతర పెట్టుబడులను కూడా ప్రకటించింది, ఇందులో రూ. 65,000 కోట్లతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) యూనిట్ల ఏర్పాటు ఉంది, దీనిలో మొదటి ప్లాంట్ ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో ప్రారంభించారు.