Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు వాగులో పడి కొట్టుకుపోవడంతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డాల్డా కంపెనీకి చెందిన జాదవ్ కృష్ణ, ఆకాశ్, శేఖర్ చేపల వేటకు వెళ్లారు. ఈ ముగ్గురు చేపలు పట్టేందుకు నిషానిఘాట్‌కు వెళ్లగా.. ఆకాష్, శేఖర్ వాగులో పడిపోయారు. ఇందులో ఆకాష్‌కు ఈత రావడంతో బయటపడగా శేఖర్ మాత్రం వాగు ప్రవాహానికి కొట్టుకుపోయాడు.
గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అలాంటి సమయంలో చేపలు పట్టేందుకు వెళ్ళి గల్లంతవడం కుటుంబంలో తీవ్ర విషాద ఘటనకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విజయ్ దేవరలతో గాలింపు చర్యలు చేపట్టారు.
భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ వహించాలని బయటకి చెరువులు వాగుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.