TG ECET 2025 Result : తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్‌లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్‌ బాలకిష్ట రెడ్డి, వీసీ కిషన్ కుమార్ రెడ్డి, కన్వీనర్ అరుణ కుమారి ఈ ఈసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్ష రాసేందుకు 25, 335 మంది దరఖాస్తు చేసుకోగా 22,983 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో 90.72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. జూన్‌ 16 నుంచి 19 వరకు నాలుగు రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు.  

Continues below advertisement


మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులు వీళ్లే
ఆర్కిటెక్చర్ ప్లానింగ్ -తురియా దీక్షిత్
ఏరోస్పెస్ ఇంజినీరింగ్‌- శివ చరణ్
బయో మెడికల్ ఇంజినీరింగ్‌- హరిణి
బయో టెక్నాలజీ- తనుజా
సివిల్ ఇంజినీరింగ్‌- వెంకటేష్
కెమికల్ ఇంజినీరింగ్‌- అశుతోష్
కంప్యూటర్ సైన్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-షభిస్తా
ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌- శివ ప్రసాద్  
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌- మహేష్
ఇన్‌స్ట్రమంటేషన ఇంజినీరింగ్‌- చంద్రసేన్  ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌- ఉజ్వల
ఫుడ్ టెక్నాలజీ-నిఖిల్ కుమార్
మెకానికల్ ఇంజినీరింగ్‌- సతీష్
మైనింగ్ ఇంజినీరింగ్ -అనిల్
మెటాలర్జికల్ ఇంజినీరింగ్‌-శ్రీ హర్షిణి
నానో టెక్నాలజీ- సాయి కృష్ణ
ఫార్మసీ- షేక్ అర్షియా కౌనేను
టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ- వర్ష  


తెలంగాణలోని ఇంజనీరింగ్, టెక్నాలజీలోని వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం జరిగిన TG ECET 2025  ఫలితాలు చూడాలంటే ఈ కింది స్టెప్స్‌ ఫాలో అవ్వండి. 
అధికారిక TG ECET కౌన్సెలింగ్ వెబ్‌సైట్ tsecet.nic.in ని సందర్శించండి.


“అభ్యర్థి లాగిన్” అని చెప్పే లింక్‌పై క్లిక్ చేయండి


మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి


వెంటనే మీ స్క్రీన్‌పై రిజల్ట్స్‌ వస్తుంది.  


భవిష్యత్తు అవసరాల కోసం ఆ ఫలితాల డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయండి


మీకు సీటు వస్తే అవసరమైన పత్రాలు


TG ECET 2025 హాల్ టికెట్


ర్యాంక్ కార్డ్


ఆధార్ కార్డ్


ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)


SSC, డిప్లొమా/B.Sc. మార్కుల మెమోలు


కుల ధృవీకరణ పత్రం 


ఆదాయ ధృవీకరణ పత్రం  


అలాట్మెంట్ ఆర్డర్


ఫీజు చెల్లింపు రసీదు


అభ్యర్థులు అన్ని పత్రాల జిరాక్స్‌లు ఉండాలి. ధృవీకరణ కోసం ఒరిజినల్స్‌ కూడా తీసుకెళ్లాలి.


TG ECET 2025 కౌన్సెలింగ్‌కు సంబంధించిన అన్ని వివరాలు, అప్‌డేట్స్‌ అధికారిక వెబ్‌సైట్ tsecet.nic.inలో అందుబాటులో ఉంటాయి.