FASTag has Multiple Uses. FASTag సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద టోల్ టాక్స్ చెల్లించడానికి ఉపయోగిస్తూ వస్తున్నాం. అయితే, ఇప్పుడు పార్కింగ్ ఫీజులు చెల్లించడానికి, ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేయాడానికి, బీమా ప్రీమియంలు, EV ఛార్జింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు. వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, బ్యాంకుల ద్వారా జారీ చేసిన దాదాపు 11 కోట్ల FASTagలను అప్‌గ్రేడ్ చేయనున్నారు. FASTagను మరింత సౌకర్యవంతంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. తద్వారా FASTagను వేర్వేరు పనులకు కూడా ఉపయోగించుకునేలా ఆధునీకరించబోతున్నారు. దీని వల్ల వివిధ కార్డులు క్యారీ చేయడం తప్పుతుంది. పెండింగ్ పనులు లేకుండా ఉంటాయని భావిస్తున్నారు.
రవాణా, మొబిలిటీ సేవలను నిర్వహించడం సులభం FASTag ఈ అప్‌గ్రేడేషన్‌పై బుధవారం ఓవర్క్‌షాప్ జరిగింది.రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, NHAI, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫిన్‌టెక్ సంస్థల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్ లక్ష్యం FASTag వినియోగానికి సంబంధించి కొత్త ఆలోచనలు పంచుకోవడం, ఫిన్‌టెక్ సంస్థల నుంచి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం. ఈ సమయంలో, టోల్ ప్లాజాల కాకుండా FASTagను ఎక్కడ, ఏ పనిలో ఉపయోగించవచ్చనే దానిపై లోతైన చర్చ జరిగింది.
రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ FASTag అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఫిన్‌టెక్, ఇతర వాటాదారుల సహకారంతో FASTag వినియోగాన్ని మరింత విస్తృతపరుస్తున్నట్టు వెల్లడించారు. యూజర్స్‌కు మరిన్న సేవలు అందించి రవాణా, మొబిలిటీ సేవలను మరింత ఈజీగా నిర్వహించేలా చేస్తామని పేర్కొన్నారు. అన్నింటికీ ఒక బలమైన వేదికగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
ముఖ్యమైన అంశంపై చర్చ ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, సమావేశంలో 'మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో' (MLFF) టోలింగ్ సిస్టమ్‌పై కూడా చర్చ జరిగింది. ఇది టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆగకుండానే టోల్ టాక్స్ చెల్లించే ఒక వ్యవస్థ. ఇది టోల్ వసూలును మెరుగుపరచడంతోపాటు టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
టూ వీలర్‌లకు నో టోల్‌టూ వీలర్లకు టోల్ ఛార్జ్ వసూలు చేస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఎక్కడైనా టూవీలర్లకు ఎలాంటి టోల్ ఫీజు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఇలాంటి తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకుంటామని కామెంట్ చేసింది.