APSRTC Record Income During Sankranti Season: ఏపీఎస్ఆర్టీసీకి (APSRTC) సంక్రాంతి ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. జనవరి 8 నుంచి 20వ తేదీ వరకూ ఆర్టీసీ 9,097 ప్రత్యేక బస్సులు నడిపింది. ఈ నెల 20న ప్రయాణికుల ద్వారా ఒకే రోజు రూ.23.71 కోట్ల ఆదాయంతో ఆర్టీసీ రికార్డు నెలకొల్పింది. 3 రోజుల పాటు రోజుకు రూ.20 కోట్ల చొప్పున ఆదాయం ఆర్జించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాగా, ఈ సంక్రాంతికి అదనపు సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలాంటి అదనపు ఛార్జీలు ప్రయాణికుల నుంచి వసూలు చేయలేదు.
APSRTC: ఏపీఎస్ఆర్టీసీకి సంక్రాంతి జోష్ - రికార్డు స్థాయి ఆదాయం
Ganesh Guptha
Updated at:
21 Jan 2025 07:57 PM (IST)
Andhra News: ఈ సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయం ఆర్జించింది. దాదాపు రూ.23.71 కోట్ల ఆదాయంతో రికార్డు నెలకొల్పింది.

సంక్రాంతికి రికార్డు స్థాయిలో ఆదాయం