YSRCP MLC Anantha Babu Video Leaked: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా వైసీపీ నేతలు మారుతున్నారు.. ఏడాది క్రితం హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లీకేజీతో రచ్చకెక్కగా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గలీజు వీడియోతో మరోసారి రచ్చకెక్కారు.. నిజానికి ఎమ్మెల్సీ అనంతబాబు వివాదాల్లో ఉండడం కొత్తేమీ కాదు.. గతంలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్యచేసి డోర్ డెలివరీ చేశాడన్న అభియోగాలపై జైలుకు కూడా వెళ్లారు. అంతకు ముందు గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడతాడని, అదేవిధంగా అటవీ సంపదను కొల్లగొడుతున్నాడని కూడా ఆరోపణలు అనంతబాబుపై అనేకం ఉన్నాయి. ఓ యువతికి ఉద్యోగం ఎరతో వీడియో కాల్స్ చేయాలని బలవంతం చేశాడని, ఆ వీడియో కాల్‌లో సదరు యువతితో ప్రైవేట్ కాల్ మాట్లాడాడని ఓ వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా మరోసారి మరోసారి వార్తల్లోకెక్కాడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.
ఆ వీడియో నాదికాదు.. మార్ఫింగ్..
ఇదిలా ఉంటే కొన్ని మీడియాల్లో వస్తున్న వీడియో తనది కాదని ఎమ్మెల్సీ అనంతబాబు చెబుతున్నారు.. తన వీడియో మార్ఫింగ్ పెట్టి ఓ వ్యక్తి తనను నాలుగు నెలలుగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెబుతున్నాడు. ఎన్నికలకు ముందు కూడా ఆ వ్యక్తి తనను డబ్బులు డిమాండ్ చేశాడని, అయితే ఎన్నికల ముందు వివాదం ఎందుకని సదరు వ్యక్తికి డబ్బులు కూడా ఇచ్చానని చెబుతున్నట్లు తెలిసింది.
ఇంతకీ వీడియోలో ఏముంది..
పలు మీడియాల్లో వస్తున్న అనంతబాబు వీడియోకు సంబందించి ఓ యువతితో ముద్దులు పెడుతూ అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.. అంతేకాదు ఫ్యాంటు ఊడదీసి ప్రయివేటు పార్ట్ చూపించినట్లు కూడా ఉండడంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
అనంతబాబు అరాచకాలు అనంతం?
మొన్నటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో జిల్లాల పునర్విభజన తరువాత అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి వెళ్లిన రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలు అనంతమని టీడీపీతోపాటు పలు పార్టీ నాయకులు విమర్శిస్తుంటారు. తన కారు డ్రైవరు హత్యోదంతంలో ఏ1 గా జైలుకు వెళ్లిన అనంతబాబు ఈ దాష్టికం వెనుక కూడా ఓ మహిళే కారణమని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషా భర్త బహిరంగంగా ఆరోపించారు. అంతేకాదు.. ఏజెన్సీలో అనంతబాబు అరాచకాలకు ఎంతో మంది యువతులు బలైపోయారని కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. ఏజెన్సీని ఇంతవరకు తన అకృత్యాలకు అడ్డాగా మార్చుకుని దుర్మార్గాలకు అనంతబాబు పాల్పడ్డాడని పలువురు ఆరోపిస్తున్నారు.
వరుస వివాదాల్లో వైసీపీ ఎమ్మెల్సీలు..
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేగిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాల వ్యవహారం వైసీపీ పరువు తీసినట్లయ్యింది.. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురీ అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తను ఉండాల్సిన ఇంటిలో తమను ఉండనీయకుండా వేధిస్తున్నాడని శ్రీను భార్య దువ్వాడ వాణి తీవ్ర ఆరోపణలు చేసింది.. అదే సమయంలో వైసీపీ నాయకురాలు మాధురి కూడా ఎదురు దాడి చేసింది.. దీంతో అటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వల్ల పార్టీ పరువు పోయిందని ఆపార్టీ నేతలు భావించారట.. దీంతో టెక్కలి ఇంచార్జ్‌గా దువ్వాడ శ్రీనివాస్‌ను వైసీపీ అధిష్టానం తప్పించి ఆస్థానంలో పేరాడ తిలక్‌ను వైసీపీ అధిష్టానం నియమించింది.
ఇదిలా ఉంటే గతంలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేశాడని ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ అనంతబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపించగా జగన్ అవేమీ పట్టనట్లు వ్యవహరించారు.. అయితే తాజాగా అనంతబాబు న్యూడ్ వీడియో బయటకు రాగా అనంతబాబు వ్యవహారంలో జగన్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది. ఇక గతంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌ల ఆడియో టేపులు రాష్ట్రంలో వైసీపీ పరువుతీశాయని చర్చజరిగింది..