Vanamadi Kondababu On Dwarampudi Chandrasekhar Reddy: వైపీపీ ప్రభుత్వం వచ్చాక కేవలం రేషన్‌ బియ్యం అక్రమాలే కాదు అన్ని రంగాల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. పక్కదారి పట్టించి విదేశాలకు పంపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పాల్పడిన అక్రమాలే ఆయన్ను దోషిగా నిలబెడతాయన్నారు. గత కొన్ని రోజులుగా కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతోన్న పరిస్థితులపై ఏబీపీ దేశం వనమాడి కొండబాబుతో ఫేస్‌ టూ ఫేస్‌..


రైస్‌ బిజినెస్‌లో కింగ్‌ అని చెప్పింది ద్వారంపూడే...
అక్రమ రవాణా చేస్తున్నావని చెప్పినప్పుడు అవును మేము రైస్‌ వ్యాపారం చేస్తున్నామని ద్వారంపూడి చెప్పుకొచ్చారు. ఆయన హైవేరీకోస్టల్‌లో గోడౌన్స్‌ కడుతున్నామని, రైస్‌ వ్యాపారంలో కింగ్స్‌మని ద్వారంపూడే స్వయంగా చెప్పారని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు. నాక్కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఈలోగా నాదెండ్ల మనోహర్‌ మంత్రి అయ్యాక ఆయనే స్వయంగా వచ్చి కొన్ని చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ అక్రమాలు జరుగుతుండటంతో దీన్ని కూడా అరికట్టాలని పవన్‌ కల్యాణ్‌ వచ్చారు..


ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఆయనే స్వయంగా చెప్పారు. అధికారం కోల్పోయాక తనకు వ్యాపారం లేదని చెప్పుకొచ్చారు.. అయితే ఆయన బినామీ పేరు మీద పెట్టి చేస్తున్నారు. ఈ సమాచారంతోనే అరికట్టేందుకు పవన్‌ రంగంలోకి దిగారు. బినామీతో ఈ అక్రమ దందా నడుపుతున్నది ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అంటూ కొండబాబు మండిపడ్డారు. 


అగర్వాల్‌ తన స్నేహితుడని ద్వారంపూడి చెప్పారు.. ద్వారంపూడి అయిదేళ్లు వ్యాపారం చేసి ఇప్పుడు లేదంటున్నారు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక బినామీలతో వ్యాపారం చేయిస్తున్నారు..  వ్యాపారం చేసుకోవడానికి కూడా ద్వారంపూడి ఎమ్మెల్యే, తండ్రి సివిల్‌ సప్లై ఛైర్మన్‌, తమ్ముడు స్టేట్‌ మిల్లర్స్‌ అధ్యక్షుడు ఇలా అంతా తామై నడిపించారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న నాథుడు లేని పరిస్థితి ఉండేది. ఒక్క అధికారి తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఆనాడే అడ్డుకట్ట వేసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి ఉండేది కాదు. దొంగలు తెలివిగానే చేస్తారు.. కానీ పట్టుకోగలమని వనమాడి అన్నారు..


ఆర్గనైజింగ్‌ చేసింది ద్వారంపూడినే..
వైసీపీ హయంలో అధికారులు ఇంకా ఉన్నారని, అయితే వారిని మార్చాల్సి ఉందన్నారు. ఈవ్యాపారాన్ని వెనుకుండి ప్రోత్సహిస్తున్నవారు త్వరలోనే దొరుకుతారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన బియ్యం కూడా చాలా మంది అమ్మేస్తున్నారని, జగన్‌ ఇదే విషయాన్ని చాలా తెలివిగా చేశారన్నారు. రేషన్‌ వ్యాన్‌లు పెట్టి సొంత మనుషులు పెట్టుకుని డోర్‌ డెలివరీ ద్వారానే తిరిగి అదే రైస్‌ను తక్కువకు కొనేలే వ్యవస్థను సృష్టించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్‌ చేసింది ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. 


మాదకద్రవ్యాల నియంత్రణపై చర్యలు..
మంత్రి నాదెండ్ల మనోహర్‌ తనిఖీలు అనంతరం రెండు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. కింది సిబ్బంది సక్రమంగా నిర్వర్తించడం లేదన్నారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు వస్తున్నాయన్న విషయం తెలిసేందన్నారు. మాచవరం సుధాకర్‌ పేరు మీద ఓ పార్శిల్‌ వచ్చిందన్నారు. అలీషా అనే వ్యక్తి దగ్గర ఈ మాచవరం సుధాకర్‌ పని చేశారని, విజయవాడలో ఉంటున్న వ్యక్తి పేరున పార్శిల్‌ రప్పించారన్నారు. దీనిపై పట్టాభిని కూడా విచారణాధికారిగా చంద్రబాబు పంపించారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 


Also Read: అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం


భూముల్లోనూ దందాచేశారు..
ద్వారంపూడి పాలనలో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో మీడియాను స్వయంగా తీసుకెళ్లి బహిర్గపరిచానని వనమాడి తెలిపారు. ఎకరం రెండు మూడు కోట్లు కూడా చేయని భూములకు 50 కోట్లు ఇప్పించారని, ఇలా రూ.500 కోట్లు మేర అక్రమాలకు పాల్పడ్డాడని తెలిపారు. అయితే దీనిపై తాను ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ జరుగుతోందన్నారు. జయలక్ష్మి బ్యాంకు గురించి బాధితులు న్యాయం చేయాలని వెళితే దాంట్లో కూడా అక్రమాలకు తెరతీశారని వనమాడి కొండబాబు ఆరోపించారు. కాకినాడ స్మార్ట్‌సిటీ, కాలువల విషయంలో అంతులేని అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. 
కూటమి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి..


కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీలు ఉండడం గతంలో వైసీపీలో దొంగలుగా వ్యవహరించిన వారు పార్టీలు మారి మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరి పనులు చేయించుకుంటున్నారన్నారు. బ్రోకర్‌ ఆఫీసులు కూడా పెట్టేశారన్నారు. 


నాపై పవన్‌ కల్యాణ్‌ కోప్పడలేదు...
కాకినాడ పోర్ట్‌ వద్దకు డిప్యూటీ సీఎం వపన్‌ కల్యాణ్‌ వచ్చినప్పుడు తనపై ఆగ్రహం వ్యక్తం చేయలేదని, అయితే మీడియాలో అలా వచ్చిందన్నారు. కాకినాడ పోర్టు విషయంలో జరుగుతున్న అక్రమాలపై పవన్‌ కల్యాణ్‌ ఆవేదన చెందారని అన్నారు. కాకినాడ జిల్లాలో జనసేన హవా కొనసాగుతుండడంపై వనమాడి కొండబాబు మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ ఈజిల్లాపై ప్రత్యేక దృష్టిపెట్టారని తెలిపారు. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారికి తగిన శిక్ష పడుతుందన్నారు. ద్వారంపూడి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ఎలా తిట్టారో అందరికీ తెలుసు అన్నారు. తనపైనా, తన కుటుంబంపైనా కూడా అనేక మాటలు అన్నారని, ద్వారంపూడి చేసిన తప్పులే జైల్‌లో పెడతాయోమోనన్నారు. ద్వారంపూడి అక్రమాలపై తాను చేసిన ఫిర్యాదు మేరకు జిల్లాలో విజిలెన్స్‌ అధికారులు తిరుగుతున్నారని, గతంలో ఇళ్ల స్థలాల కోసం కాలువలు పూడ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రయత్నం చేశారని, దీనిపై కూడా రూ.5 కోట్లు ఫైన్‌ వేశారని, అది కూడా వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. గ్రీన్‌ ట్రైబ్యునల్‌ వస్తే తమను మీడియానులోనికి రానివ్వలేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పుచేసినవారు ఎప్పటికీ చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. 


Also Read: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ