Yanamala Krishnudu and Yanamala RamaKrishnudu : కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో అన్నాదమ్ముళ్ల మధ్య వర్గ పోరు నడుస్తోందని గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అన్న యనమల రామకృష్ణుడును కాదని తమ్ముడు యనమల కృష్ణుడికి టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ విషయంలో అన్నాదమ్ముళ్ల మధ్య విభేదాలు తలెత్తాయని ఏపీ పాలిటిక్స్ లో చర్చ జరిగింది. అయితే అవన్నీ వదంతులేనని, తాము ఎప్పటికీ కలిసి ఉంటామని ఈ సోదరులు స్పష్టం చేశారు.
టీడీపీకి తుని ఎమ్మెల్యేగా గెలిచి బహుమతిగా ఇస్తమని, మళ్ళీ ఇక్కడ టీడీపీ జండా ఎగరవేస్తం అన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. తాను, తన తమ్ముడు ఎప్పుడు కలిసే ఉంటామని కొన్ని మీడియా ఛానల్స్ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నాలుగైదు మీటింగ్లు మేమిద్దరం కలిసే పెట్టామని చెప్పారు. ప్రస్తుతం పార్టీ యువతకు ప్రాధాన్యత ఇస్తూ బాధ్యతలు యువతకు అప్పగించాయని ఆ విషయమై తాను, కృష్ణుడు కలిసి తీసుకున్న నిర్ణయం అని తెలియజేశారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఈ సోదరులు బరిలోకి దిగడం లేదని తేలిపోయింది. అదే సమయంలో రామకృష్ణుడు కూతురు దివ్యకు టీడీపీ టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తుందని నియోజకవర్గంలో ఈ మీటింగ్ ద్వారా కాస్త క్లారిటీ వచ్చినట్లయింది.
యనమల సోదరుడు యనమల కృష్ణుడు మాట్లాడుతూ.. నేను 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నాను. అధికారం ఉన్నా లేకపోయినా నన్ను కార్యకర్తలు నమ్ముకుని ఉన్నారు. పదవి ఉన్నా లేకపోయినా రామకృష్ణుడును, నన్ను ఒకేలా చూశారు ఒకేలా గౌరవించారు. నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను అన్నారు. ఈ 40 సంవత్సరాలు కాలంలో మేము విడిపోలేనిది ఇప్పుడు మేము విడిపోతామా.. నేను మా అన్నయ్య ఎప్పుడు ఒకటే ఆయన మాటే నా మాట.. నా మాట ఆయన మాట అన్నారు. నా రాజకీయ జీవితంలో 36 సంవత్సరాలు రాజకీయ జీవితం ఒక వైపు అయితే ఈ 4 సంవత్సరాలు ఒకవైపు ఎలాంటి దుర్మాపు పాలన ఎప్పుడూ చూడలేదన్నారు.
ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కేసులు టిడిపి కార్యకర్తలపై పెట్టింది. ఆ కేసులన్నిటికీ కొత్తవారు వస్తే వాళ్ల పరిస్థితి ఏంటని ఆలోచించాలే తప్ప దివ్య పై ఎటువంటి ద్యేషం గాని వ్యతిరేకత గాని లేదు అన్నారు. అధికారం వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ కొట్టి వేస్తారని, మీకు ఏమన్నా జరిగితే నేనే మీ వెనక ఉంటానని యనమల కృష్ణుడు కార్యకర్తలకు తెలియజేశారు.
యనమల కృష్ణుడుకీ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ గా బాధ్యతలు
యనమల కృష్ణుడు మాట్లాడుతూ 1982 నుంచి తెలుగుదేశం పార్టీతో ఉన్నామని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నిదానం నినాదంతో ఆనాడు ఎన్టీ రామారావు ప్రజల్లోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలనుంచి పార్టీలో చేరామని నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పార్టీ ఏ పదవి ఇస్తే ఆ పదవిలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని చేస్తానని కృష్ణుడు చెప్పారు.